సూర్యాపేట జిల్లా:మఠంపల్లి మండల కేంద్రంలోని వీఆర్ఎల్ ఫంక్షన్ హాల్లో బుధవారం ఉదయం 9.00 గంటలకు జరిగే భూభారతి చట్టం -2025 సదస్సుకు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హాజరుకానున్నారని మఠంపల్లి ఎమ్మార్వో మంగ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.భూ భారతి చట్టంపై సమగ్ర అవగాహన కొరకు మండలములోని రైతులు, నాయకులు,ప్రజాప్రతినిధులు, అధికారులు,మండల ప్రజలందరూ హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.