సూర్యాపేట జిల్లా:పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా ముతవలీలుగా హైకోర్టు నిర్ధారించిన వారు హుజూర్ నగర్ ఎమ్మెల్యే,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ముతవలీలు మహమ్మద్ ముబీన్, మహమ్మద్ సాలార్ మాట్లాడుతూ జాన్ పహాడ్ దర్గా అభివృద్ధికి సహకరించాలని,దర్గాను సందర్శించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎండి ఖాలెద్ అహ్మద్,మహమూద్,జమాల్ హుసేని,మహమ్మద్ గౌస్,గౌస్ బాబా తదితరులు పాల్గొన్నారు.