సూర్యాపేట జిల్లా:జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునే నిరుద్యోగ యువతకు చుక్కెదురైంది.ఏప్రిల్ 14 వరకు ఉన్న ఆన్లైన్ దరఖాస్తులకు వరుస సెలవులు రావడంతో గడువును ఏప్రిల్ 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
కానీ,తీరా దరఖాస్తు చేసుకుందామని వెళితే దరఖాస్తు గడువు ఏప్రిల్ 14వ తేదీతోనే ముగిసిందని మీ సేవ నిర్వాహకులు చెప్తున్నారు.ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోవడం,వెబ్సైట్ క్లోజ్ చేశారని సమాచారంతో నిరుద్యోగుల్లో గందరగోళం ఏర్పడింది.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులైన ఐదు లక్షల ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.