ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపాలంటూ సిపిఐ (ఎం_ఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రష్యా ప్రభుత్వ దిష్టిబొమ్మను సూర్యాపేట లోని కొత్త బస్టాండ్ వద్ద దగ్ధం చేయడం జరిగింది .గత ఆరు రోజుల నుండి యుక్రేన్ పై రష్యా అత్యంత అమానుషంగా దాడులు చేస్తూ యుద్ధం చేయడాన్ని నిరసిస్తూ సిపిఐ( ఎం-ఎల్ )న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం.డేవిడ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ రష్యా ప్రభుత్వం ఉక్రెయిన్ ప్రజలపై బాంబులతో దాడి చేస్తూ వయసుతో నిమిత్తం లేకుండా హత్యలకు పాల్పడడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు.ప్రపంచంపై అమెరికాతో పాటు రష్యా కూడా ఆధిపత్యం వహించడం కోసం పోటీపడుతూ ఉక్రెయిన్ ను లొంగ తీసుకోవడానికి కుటిల ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు.ఉక్రెయిన్ భూభాగం ,గగనతలం నుంచి రష్యా సైన్యాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని బాంబు దాడులను నిలిపివేయాలని కోరారు.
రెండు దేశాల మధ్య వచ్చినటువంటి సమస్యలను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని తెలియజేశారు.ప్రపంచంలో యుద్ధ ఉద్రిక్త వాతావరణం రష్యా ప్రభుత్వం కల్పించడం సరైంది కాదని అన్నారు.
ప్రపంచ ప్రజలందరూ యుద్ధం వద్దు శాంతి కావాలని కోరుతున్నా రష్యా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు.ఉక్రెయిన్ లో ఉన్న భారతీయ పౌరులకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా రక్షణ కల్పిస్తూ భారతదేశానికి తరలించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య,ఏ ఐ కె ఎమ్ ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్,పీ వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కునుకుంట్ల సైదులు,ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు కారంగుల వెంకన్న,ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు దాసోజు మధు,ఏ ఐ కే ఎం ఎస్ డివిజన్ నాయకులు సామ నర్సిరెడ్డి,బండి రవి,పెద్దింటి అశోక్ రెడ్డి,మొన్న మధు,మల్లేష్ ,గుంటి మురళి,వీరబోయిన రమేష్,బాల్క పవన్, ఎస్కే సయ్యద్,శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.