తడిసిన ధాన్యం ఆగ్రహించిన అన్నదాతలు

యాదాద్రి భువనగిరి జిల్లా: గుండాల మండల కేంద్రంలోని పిఎసిఎస్ ( PACS )కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలు వర్షంతో తడిసి పోవడంతో ఆగ్రహించిన అన్నదాతలు తడిసిన ధాన్యంతో రోడ్డెక్కారు.ఈ సందర్భంగా రైతు అందెం కృష్ణారెడ్డి( Andem Krishna Reddy ) మాట్లాడుతూ గత మూడు నెలల నుండి కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో మంగళవారం కురిసిన వర్షానికి ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 Stained Grain Angered Rice Farmers , Andem Krishna Reddy, Pacs-TeluguStop.com

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే దళారులు మిల్లర్లు ఏకమై డబ్బులు ఇచ్చినవారి వడ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, మిగతా వారి ధాన్యం ఇలా వర్షార్పణం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బాధిత రైతులు రంగారెడ్డి, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube