సూర్యాపేట జిల్లా:కోదాడ నియోజకవర్గ గెలుపు గుర్రం ఎవరనేది రాజకీయ విశ్లేషకులు సైతం అందడం లేదు.ఇక్కడి నుండి ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ (ఉత్తమ్ పద్మావతి రెడ్డి)( Uttam Padmavathi Reddy ), బీఆర్ఎస్(బొల్లం మల్లయ్య యాదవ్), జనసేన & బీజేపీ(మేకల సతీష్ రెడ్డి),బీఎస్పీ (పిల్లుట్ల శ్రీనివాస్),సీపీఎం (మట్టిపెళ్ళి సైదులు),ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (అంజి యాదవ్) బరిలో ఉన్నా కాంగ్రెస్,కారు మధ్యనే హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు.
పార్టీల,స్వతంత్ర అభ్యర్దుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ పైట్ మాత్రం హస్తం కారు మధ్యనే అంటున్నారు.స్వతంత్ర అభ్యర్థులు కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.
కానీ, ప్రధాన రాజకీయ పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు గంటల వ్యవధిలో పార్టీ కండువాలు మారుస్తూ ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని అయోమయం నెలకొంది.ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి.
దీనితో కోదాడ( Kodad )లో ఎవరి బలమెంతో అంతుచిక్కడం లేదని సర్వేలు సైతం వెల్లడిస్తున్నాయి.కోదాడలో పురుషుల ఓట్ల కన్నా,స్త్రీల ఓట్లే ఎక్కువ ఉండడంతో వివిధ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు మహిళలకే ఎక్కువ ప్రియార్టీ ఇస్తూ మాకే ఓటు వేయాలని వారి వారి గుర్తులను చూపిస్తూ అభ్యర్థిస్తున్నారు.
గెలుపుపై ఎవరి అంచనాలు వారు వేసుకుంటూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.కానీ,నాయకుల,కార్యకర్తల,జంపింగ్ లతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడ్డారు.ఇక ఓటర్ల నాడి ఎవరికీ అందని స్థాయిలో ఉందని,కనీసం ఎవరికీ వేస్తారో చెప్పలేని విధంగా అందరికీ జై కొడుతూ తమదైన శైలిలో తమ నిర్ణయాన్ని తెలిపేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనప్పటికీ నవంబర్ 30న ఓటింగ్ వరకు ఓ అంచనాకు రావచ్చని, డిసెంబర్ 3న కానీ,గెలిచేది ఎవరూ? నిలిచేదెరు తేలిపోతుందని అంటున్నారు.