కోదాడ మున్సిపాలిటీ చైర్మన్ గా సామినేని ప్రమీల...!

సూర్యాపేట జిల్లా:కోదాడ బీఆర్ఎస్ పార్టీ( BRS )కి చెందిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై శనివారం పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నికను ఆర్డీవో సూర్యనారాయణ, కమిషనర్ వెంకటేశ్వర నాయక్ నేతృత్వంలో ఎన్నుకోవడం జరిగింది.

 Samineni Pramila As Chairman Of Kodada Municipality...!-TeluguStop.com

కోదాడ మున్సిపాలిటీలో 35 కౌన్సిలర్లకు గాను ఒకరు మృతి చెందగా 34 మంది కౌన్సిలర్లు వున్నారు.

మున్సిపల్ చైర్మన్( Municipal Chairman ) ఎన్నిక సందర్భంగా మొత్తం 29 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు.

కోదాడ నూతన చైర్ పర్సన్ గా సామినేని ప్రమీల( Samineni Pramila ),వైస్ చైర్మన్ గా కందుల కోటేశ్వరరావు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి బాధ్యతలను చేపట్టారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్,వైస్ చైర్మన్లను మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు,టీపీసీసీ చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి,మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, పార సీతయ్య,వంగవీటి రామారావు,మున్సిపల్ కౌన్సిలర్లు వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఘనంగా సన్మానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube