సూర్యాపేట జిల్లా:ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల విలవిల్లాడిన విషయం తెలిసిందే.సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం కూడా చిగురుటాకులా వణికింది.
కోదాడ మండలం తొగర్రాయి గ్రామంలో వచ్చిన వరదకు గ్రామ స్వరూపమే మారిపోయింది.రాత్రివేళ చిమ్మచీకట్లో కళ్ళు మూసి తెరిచేలోపు వరద నీరు గ్రామాన్ని చుట్టుముట్టి విలయతాండవం సృష్టించింది.
ఇళ్లుమునిగి,బయటి వరద,ఇళ్ళల్లోకి నీరు,ఇంట్లో ఉండలేక, బయటికి రాలేక గ్రామస్తులు పడ్డఅవస్థలు వర్ణనాతీతం.ఇంటిని,వాహనాలను,పశువులను వదిలేసి ప్రాణ భయంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీసి బ్రతికి బయటపడ్డారు.
కానీ,ఇళ్లు,వాహనాలు,పశువులు,దుస్తులు,పొలాలు సర్వం కోల్పోయిన నిరశ్రాయులు మిగిలిపోయారు.గ్రామానికి చేరుకున్న క్యూ న్యూస్ గ్రామస్తులు మాట్లాడుత అంతా అయిపోయిందని,తినడానికి తిండి, ఉండడానికి ఇళ్లు, కట్టుకోడానికి బట్టలు లేక అల్లాడుతున్నమని బోరున విలపించారు.
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం నారాయణపురం చెరువు కట్టతెగి దిగువలో ఉన్న తొగర్రాయి,కూచిపూడి గ్రామాలకు వరద నీరు రావడంతో తొగర్రాయిలో ఐదు ఇల్లులు ధ్వంసం అయ్యాయని,ఇంట్లో ఉన్న వస్తువులు,బీరువా, బీరువాలో ఉన్న బంగారం,నగదులన్ని కొట్టుకుపోవడంతో లబోదిబోమంటున్నారు.కూచిపూడిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
వరదల్లో పొలాలు నీట మునిగి ఎవరు గెట్టు ఎక్కడుందో తెలియని విధంగా ఇసుక దిబ్బలు పేరుకుపోయి గుర్తు పట్టలేని స్థితిలో వరి పొలాలు ఉన్నాయి.కోదాడ పరిస్థితి అద్వానంగా మారింది.
ఎన్నడు లేని విధంగా వరద చుట్టుముట్టి ఇద్దరు ప్రణాలు బలికొన్న విషయం తెలిసిందే.అయితే రోడ్లు ప్రధాన రహదారులు ధ్వంసం కావడంతో అధికారులు ముమ్మరంగా మరమతులు చేపడుతున్నారు.
అనంతగిరి మండల పరిధిలోని గొండ్రియాల, కొత్తగూడెం, చిమిర్యాల, గ్రామాల్లో పాలేరు వాగు అతలాకుతలం చేసింది.రోడ్ల ఇళ్లులు ధ్వంసం అయ్యాయి.
పంట పొలాలు,కరెంటు స్తంభాలు,కార్లు,ఆటోలు, ట్రాక్టర్లు కొట్టుకుపోయిన పరిస్థితి అందరికీ తెలిసిందే
.