మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. ఆ ఇద్దరు హీరోలకు మైనస్ కానుందా?

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మోక్షజ్ఞ.నందమూరి నట సింహం బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎప్పటినుంచో ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

 Balayya Son Mokshagnya Threat And Dange For Jr Ntr And Kalyan Ram, Balakrishna-TeluguStop.com

అయితే ఎట్టకేలకు అభిమానులు ఎదురుచూస్తున్న రోజులు రానే వచ్చాయి.త్వరలోనే మోక్షజ్ఞ సినిమా సెట్స్ పైకి వెళ్ల నుంది.

ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నారు.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Balakrishna, Jr Ntr, Kalyan Ram, Mokshagnya, Tollywood-Movie

ఇకపోతే ఆ సంగతి పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం అనే పదాన్ని మనం తరచుగా వింటూ ఉంటాం.ఒక స్టార్ హీరో లేదా హీరోయిన్ నుంచి వారు వారసులు సినిమాల్లోకి రావడం అలా వచ్చే డోస్ ఎక్కువైతే అప్పుడు గట్టిగా నెపోటిజం అనే టాక్ వినిపిస్తుంది.కాగా ఇది లేని ఇండస్ట్రీ ఎక్కడా లేదు.కానీ ఈ నెపోటిజం గెపోటిజం అనే మాటలని మాత్రం వారి హీరోలని ఆరాధించే అభిమానులు ససేమిరా పట్టించుకోరు.టాలెంట్ ఉంటేనే కదా వాళ్ళైనా కూడా సర్వైవ్ అయ్యేది.అయినా టాలెంట్ లేకపోతె ఎంత స్టార్ హీరో కొడుకైనా కమెడియన్ గానే మిగిలిపోతాడు అంటారు.

అలా సినిమాలో ఇప్పుడు సీనియర్ హీరోల కొడుకులు మనవళ్లు, కూతుళ్లు ఇలా చాలా మంది పరిచయం అవుతూనే వస్తున్నారు.ఇలా తెలుగులో లేటెస్ట్ గా అనౌన్స్ అయ్యిన స్టార్ హీరో కొడుకు నందమూరి తారక మోక్షజ్ఞ్య తేజ.

Telugu Balakrishna, Jr Ntr, Kalyan Ram, Mokshagnya, Tollywood-Movie

మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ( Balakrishna )కొడుకుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లాంచ్ ని తెలుగులో అయితే ఇస్తున్నట్టుగా తన బర్త్ డే కానుకగా అనౌన్స్ చేసేసారు.కాగా ఇక్కడ నుంచే అసలు రచ్చ స్టార్ట్ అయ్యింది.ఎంత నందమూరి కుటుంబం నుంచి చాలా మంది స్టార్స్ ఉన్నప్పటికీ వారి కుటుంబంలో ఎప్పుడూ కొన్ని కలహాలు మాత్రం ఉన్నాయని ఇప్పటికీ టాక్ వినిపిస్తూ ఉంటుంది.జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అలాగే బాలయ్య అభిమానులు నడుమ సోషల్ మీడియాలో కానీ అటు ఆఫ్ లైన్ లో కానీ గొడవలు జరిగిన సందర్భాలు కోకొల్లలు, ఇది పక్కన పెడితే మోక్షజ్ఞ్య ఎంట్రీకి జూనియర్ ఎన్టీఆర్ అలాగే తన అన్న నందమూరి కళ్యాణ్ రామ్( Nandamuri Kalyan Ram ) లు కూడా తమ శుభాకాంక్షలు చెప్పారు.

కానీ మోక్షజ్ఞ్య ఎంట్రీకి కూడా తక్కువ అంచనాలు ఏమీ లేదు.సరైన వారసుడు వస్తే నందమూరి వంశాన్ని అతడే టేకోవర్ చేస్తాడు అంటూ వారి అభిమానుల్లోనే ఒక టాక్ ఎప్పుడూ ఉంటుంది.

ఇలా ఇప్పుడు మోక్షజ్ఞ్య ఎంట్రీ యంగ్ టైగర్ ఎన్టీఆర్, అలాగే కళ్యాణ్ రామ్ ల ఉనికికి ఎప్పటికైనా డేంజరే అన్నట్టుగా ఆల్రెడీ టాక్ మొదలైంది.ప్రస్తుతం మార్కెట్ పరంగా ఎన్టీఆర్ నందమూరి వంశంలో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు.

మరి రానున్న రోజుల్లో మోక్షజ్ఞ్య ఎన్టీఆర్ కి గట్టి పోటీ ఇచ్చేవాడిగా మారుతాడా? నందమూరి అభిమానులు ఎలా తమ సపోర్ట్ ని ఈ హీరోలకి అందిస్తారు అనేవి రసవత్తరంగా మారాయి.మరి నిజంగానే మోక్షజ్ఞ ఎంట్రీ తారక్ అలాగే కళ్యాణ్ రామ్ లకు డేంజర్ గా మారుతుందా లేదా అన్నది చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube