ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో మందుల కొరత...!

నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మందుల కొరత వేధిస్తుందని,6 మాత్రలు రాస్తే 5 బయట ప్రైవేట్ మెడికల్ షాపుల్లో తెచ్చుకోవాల్సి వస్తుందని రోగులు ఆరోపిస్తున్నారు.సర్కారు నుంచి పలురకాల మందుల సరఫరా గత కొద్ది రోజులుగా నిలిచిపోయిందని,ముఖ్యంగా బీపీ,షుగర్‌,గ్యాస్‌,జలుబు, దగ్గు గోలీలు దొరుకడం లేదని, దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చేసేదేమీ లేక ప్రైవేట్‌లో కొనుగోలు చేస్తున్నారని తెలుస్తోంది.

 Shortage Of Medicines In Government General Hospital , Government General Hospit-TeluguStop.com

పేరు గొప్ప ఊరు దిబ్బలాగా నల్లగొండ ప్రభుత్వ పెద్దాసుపత్రి పరిస్థితి ఉందని, అడుగడుగునా సమస్యలు తాండవిస్తున్నాయని,వీటిని పట్టించుకునే వారే కరువయ్యారని రోగులు వాపోతున్నారు.ఎన్ని సమస్యలు ఎలా ఉన్నా ఈ ఆసుపత్రిలో మందుల కొరత మాత్రం తీరడం లేదని,ఈ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న తర్వాత  మందులను బయటి దుకాణాలలో కొనాల్సి రావడంతో రోగులు,వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమాచారం.

ఇది ప్రభుత్వ ఆసుపత్రి కదా ఇక్కడ మందులు ఉండాలి కదా అని ఎవరైనా అడిగితే ఇక్కడ లేవు,మేమేమి చేయాలని దురుసుగా మాట్లాడుతున్నారని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీనితో సర్కారు దవాఖానాలో చికిత్స కోసం వచ్చే నిరుపేద రోగులకు మందుల కొనుగోలు పెను భారంగా మారుతోందని, ట్రీట్ మెంట్ వరకు ఉచితంగానే అందుతున్నా,ఔషధాలు మాత్రం పూర్తి స్థాయిలో దొరకడం లేదని అంటున్నారు.

దీనితో ఉమ్మడి జిల్లా ప్రజలు ఈ జనరల్ ఆసుపత్రే పెద్దదిక్కుగా భావించి ఇక్కడ తగిన వైద్యసేవలు అందుతాయన్న ఆశతో వస్తే వివిధ రకాల సమస్యలతో వ్యయప్రయాసలు తప్పడం లేదని అంటున్నారు.ఓ వైపు వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతుండగా,మరోవైపు రోగులకు అవసరమైన మందుల కొరత పట్టిపీడిస్తోదని,దీంతో వైద్యులు ప్రైవేటుగా తెచ్చుకోవాలని చీటి రాసిస్తున్నారని,విధిలేక వందల రూపాయలు వెచ్చించి మందులు తెచ్చుకుంటున్నామని చెబుతున్నారు.

స్టోర్ లో నిల్వను బట్టి మందులను అందుబాటులో ఉంచాల్సిన అధికారులు తమకు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని, అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగా రోగులు,వారి సహాయకులు నానా అగచాట్లు పడాల్సి వస్తోందని,అసలే వ్యాధుల కాలం కావడంతో ఆసుపత్రికి రోగుల తాకిడి ఎక్కువైందని,ఈ సమయంలో జ్వరానికి సంబంధించిన మందులు కూడా లేకపోవడంతో రోగుల బాధ వర్ణానాతీతంగా మారిందని చెబుతున్నారు.వర్షాకాలం కావడంతో సాధారణంగా సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తాయి.

ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా,టైపాయిడ్‌, చికెన్‌గున్యా, పైలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి.ప్రస్తుతం వర్షాలు భారీగా లేనప్పటికీ విషజ్వరాలు పెరుగుతున్నట్లు తెలుస్తున్నది.

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రోజురోజుకూ రోగుల తాకిడి పెరుగుతున్నది.ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీజనల్‌ వ్యాధులకు సంబంధించి అన్నిరకాల కిట్లు,పరీక్షలు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

కానీ,ప్రభుత్వం సకాలంలో మెడిసిన్‌ సరఫరా చేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా షుగర్‌,బీపీ పేషెంట్లకు నిత్యం ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి ఉంటుంది.

లేకపోతే శరీరం నియంత్రణ తప్పుతుంది.షుగర్‌ పెరుగడం,బీపీ పెరుగడం,తగ్గడం లాంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.

ఆస్పత్రిల్లో ఈ మందులు లేకపోవడంతో కొందరు ప్రైవేట్‌ మెడికల్‌ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు.దాంతో రోగుల జేబులు గుల్ల అవుతున్నాయి.

ఇంకొందరు కొనలేక వెనుదిరిగి పోతున్న పరిస్థితి నెలకొంది.ఇదే విషయమై నల్లగొండ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ కుమారిని వివరణ కోరగా రోగులకు సరపడా మందులు అందుబాటులో ఉన్నాయని,ఎలాంటి సమస్య లేదన్నారు.

ఎప్పటికప్పుడు కలెక్టర్‌ పర్యవేక్షణ చేస్తున్నారని,ఏదైనా సమస్య వస్తే వెంటనే అయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నామని, మందులు అవసరమైతే ఇండెంట్‌ పెట్టి బయట నుంచి కొనుగోలు చేస్తున్నామని, సీజనల్‌ వ్యాధులు కావడంతో రోజూ రోగులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు.రక్త, మూత్ర,ఇతర అన్ని రకాల పరక్షలు చేస్తున్నామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube