ఎంపిఓ బదిలీపై రాజకీయ దోబూచులాట

సూర్యాపేట జిల్లా:ప్రభుత్వ కొలువు చేసే అధికారులు ఎప్పటికైనా ఒక చోట నుండి మరో చోటకు బదిలీ బ కావడం సర్వ సాధారణం.కానీ,సూర్యాపేట జిల్లా అనంతగిరి ఎంపీఓ మాత్రం బదిలీపై వెళ్లేందుకు ససేమేరా అంటున్నాడని ఈ మండలం వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ భీస్మిచ్చుకొని కూర్చున్నాడని తెలుస్తుంది.

 Political Tussle Over Mpo Transfer-TeluguStop.com

అంతటితో ఆగకుండా తన బదిలీని ఆపేందుకు మండల వ్యాప్తంగా ఉన్న సర్పంచ్ లను స్థానిక ఎమ్మెల్యే వద్దకు తీసుకువెళ్లి రికమండేషన్ చేయించడం చర్చనీయాంశంగా మారింది.అనంతగిరి మండల నూతన ఎంపీవోగా జగదీష్ నియమితులయ్యారు.

ప్రస్తుతం చింతలపాలెం ఎంపీవోగా వున్న ఆయన్ను అనంతగిరికి బదిలీ చేస్తూ శుక్రవారం డీపీవో యాదయ్య ఆదేశాలు జారీ చేశారు.అనంతగిరిలో ఇప్పటివరకు పని చేసిన ఎంపీవో తుమ్మల నాగేశ్వరరావును చిలుకూరు మండలానికి బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు.

నూతన ఎంపీవోగా నియమితులైన జగదీష్ సోమవారం బాధ్యతలు కూడా చేపట్టనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube