సూర్యాపేట జిల్లా: మోతె మండలం రాంపురంతండా గ్రామపంచాయతీ పరిధిలోని 47 ఎకరాల విస్తీర్ణం గల ప్రభుత్వ భూమి(బోరబండ) కబ్జాకు గురవుతుంది.గ్రామనికి చెందిన కొందరు బండపై మట్టిపోసి చదును చేసుకొని వ్యవసాయం చేసుకుంటూ సొంత భూమిలాగా ఎవరికీ ఇష్టమొచ్చినట్లు వారు హద్దు రాళ్లును ఏర్పాటు చేసుకున్నారు.
దీంతో గ్రామంలోని మరికొందరు పూర్తిగా గుట్టను సైతం ఆక్రమించి రాతికట్టును హద్దుగా ఏర్పరిచారు.గతంలో ఈ బండపై వడ్డెరలు వృత్తి రీత్యా బండ కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్న క్రమంలో ఈ కబ్జారాయుళ్లు అక్కడి నుండి వారిని ఖాళీ చేయించి,చెప్పులతో ఎవరూ పోకుండా కట్టడి చేసి,త్వరలో ప్రహరీ నిర్మిస్తామని,ఎవరూ రావొద్దంటూ హుకుం జారీ చేశారు.
దీంతో వడ్డెరలు సైతం అటుపోవడం మానేశారు.కానీ,ప్రస్తుతం ఆ భూమి ఎక్కడిక్కడ కబ్జాకు గురవుతున్న నేపథ్యంలో గ్రామస్థుల మధ్య పరస్పర వివాదం చెలరేగుతోంది.ఈ విషయమై కొందరు గ్రామస్థులు మీడియాను ఆశ్రయించారు.గ్రామానికి చెందిన బాలాజీ మీడియాతో మాట్లాడుతూ స్థానిక తహశీల్దార్,జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి గ్రామంలోని 47 ఎకరాలు ప్రభుత్వ భూమిని సర్వే చేయించి,ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని,ప్రభుత్వ భూమిని కాపాడాలని, మళ్ళీ ఎవరూ ఆ భూమిలో అడుగు పెట్టకుండా హద్దు రాళ్ళను ఏర్పాటు చెయాలని కోరుతున్నారు.