ఉదయాన్నే నిమ్మరసం కలిపిన నీటిని తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం నిద్ర లేవగానే మన రోజు ఎంతో ఫ్రెష్ గా స్టార్ట్ అవడం కోసం, అలాగే రాత్రంతా అలసిన శరీరానికి ఎనర్జీ అందించడం కోసం గోరు వెచ్చనీ నీటిలో నిమ్మరసం మరియు తేనె( Hot Water Lemon and Honey ) కలుపుకొని తాగడం అనేది మనలో చాలామందికి అలవాటు ఉంటుంది.అయితే ఇలా చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి బలంగా తయారవుతుంది.

 Amazing Health Benefits Of Lemon Water,lemon Water,belly Fat,immunity System,vit-TeluguStop.com

అలాగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో తగినంత నీటి పరిమాణం ఉండాలి.

దీని వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది.చర్మం ఆరోగ్యంగా ఉండడానికి, జీర్ణ క్రియలు చురుగ్గా పనిచేయడంలో దీని పాత్ర ఎంతో ఉంటుంది.

Telugu Belly Fat, Citric Acid, Tips, Hot Lemon Honey, Immunity System, Kidney, L

విటమిన్ సి కావాల్సినంత లభిస్తుంది.వ్యాధి నిరోధక శక్తి( Immunity System ) బలంగా ఉండడానికి ఇది ఎంతో అవసరం.అలాగే గాయాలు మానడంలో కొల్లేజన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.చర్మం కణజాలం ఆరోగ్యంగా ఉండేందుకు కొల్లాజన్ అవసరం.కణాలు దెబ్బతినకుండా విటమిన్ సి( Vitamin C ) రక్షిస్తుంది.దీంతో పాటు చర్మం తాజాగా కనిపిస్తుంది.చర్మం ముడతలు పడడాన్ని కూడా నివారిస్తుంది.జీర్ణరసాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.దీంతో తిన్నది మంచిగా జీర్ణం అవుతుంది.దీనివల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం సమస్యలు తొలగిపోతాయి.

నిమ్మనీరు బరువు తగ్గేందుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.జీర్ణ క్రియలు బలపడడం వల్ల ఇది సాధ్యపడుతుంది.

Telugu Belly Fat, Citric Acid, Tips, Hot Lemon Honey, Immunity System, Kidney, L

శరీరంలో చెడు కొవ్వులు కరిగిపోతాయి.నిమ్మలో పొటాషియం గుండెను రక్షిస్తుంది.రక్తపోటును కూడా తగ్గిస్తుంది.ఆర్టరీస్ దెబ్బ తినకుండా యాంటీ ఆక్సిడెంట్లు రక్షణ ఇస్తాయి. కిడ్నీలలో రాళ్లు( Kidney Stones ) ఏర్పడకుండా నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్( Citric Acid ) ఉపయోగపడుతుంది.మూత్రంలో సిట్రేట్ స్థాయిలు పెరగడం వల్ల రాళ్లు ఏర్పడతాయి.

ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది.నిమ్మ నీరు ఎక్కువగా తీసుకుంటే కూడా కిడ్నీలలో రాళ్లు ఏర్పడతాయి.

నిమ్మ లో అసిడిక్ గుణం పండ్లపై ఎనామిల్ ను దెబ్బతిస్తుంది.అందుకే నిమ్మరసాన్ని ఎప్పుడు నీళ్లతో కలిపి తీసుకోవాలి.

ఇది శరీరంలోని పీహెచ్ ను బాలన్స్ చేస్తూ ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube