ఇన్నేళ్ల తర్వాత చందమామ బ్యూటీ సింధు మీనన్ ఎలా ఉందో తెలుసా.?

సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు అలాంటి వారు చాలా ఎత్తుకు ఎదిగిన తర్వాత వాళ్ల నీ ఏదో ఒక రకంగా నెగిటివ్ చేయాలని చాలామంది చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలా చేసిన కొంత మంది ఆర్టిస్టులు వాళ్ళ కెరియర్ పరంగా చాలా నష్టపోయారు హీరో సుమన్ గారిని కూడా ఆయన స్టార్ హీరోగా ఉన్నప్పుడు తప్పుడు కేసుల్లో ఇరికించి చాలా ఇబ్బంది పెట్టారు అలాగే కెరీర్ పరంగా కూడా స్టార్ గా ఉండాల్సిన ఆయన్ని కింది స్థాయికి పడిపోయేలా చేశారు అలాగే ప్రస్తుతం ఒక హీరోయిన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఆవిడ హీరోయిన్ సింధు మీనన్.

ఆమె గురించి మనందరికీ తెలుసు చందమామ సినిమాలో తనదైన నటనతో ఆడియన్స్ ని మంత్రముగ్ధులను చేసిన అమ్మాయి సింధు మీనన్ తన కో ఆర్టిస్ట్ అయిన కాజల్ కి పోటీ ఇస్తూ తనదైన నటనతో మంచి ప్రశంసలు అందుకుంది.

తనకు ఆ సినిమాలో నటనలో కావాల్సిన మెళుకువలను డైరెక్టర్ కృష్ణ వంశీ చెప్పి చేసి చూపించే వాడని సింధు మీనన్ చాలా సార్లు చెప్పారు.ఎవరైనా సరే కృష్ణవంశీ సినిమాల్లో నటిస్తే వాళ్లకి సపరేట్ గుర్తింపు వస్తుందని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అంతపురం సినిమాలో జగపతిబాబు కనిపించింది పది నిమిషాలే అయిన ఆ క్యారెక్టర్ కి మంచి గుర్తింపు వచ్చింది ఏ ఆర్టిస్ట్ ను ఎలా వాడుకోవాలో కృష్ణవంశీ కి బాగా తెలుసు.

ఆ తర్వాత సింధు మీనన్ ఆడంతే అదో టైపు, వైశాలి లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.వైశాలి లో అయితే తన నటనతో చాలా మంది హీరోయిన్స్ కి సవాల్ విసిరింది అనే చెప్పొచ్చు అయితే కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన త్రినేత్రం మూవీ లో సిజ్జు రాశి హీరో హీరోయిన్ కాగా సింధు మీనన్ మాత్రం నెగిటివ్ పాత్రలో నటించి తనదైన నటనను చూపించింది.

కోడి రామకృష్ణ సినిమాల్లో హీరో హీరోయిన్ లతో పాటు విలన్ పాత్రలు చేసే వాళ్లకి కూడా మంచి గుర్తింపు ఉంటుంది అరుంధతి సినిమాలో అనుష్క తో పాటు సోనుసూద్ క్యారెక్టర్ కి కూడా మంచి గుర్తింపు వచ్చింది.అలాగే కొన్ని సినిమాల్లో తనదైన నటనతో యావత్ తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది.

Advertisement

అయితే తర్వాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడంతో ఆవిడ అమెరికాలో స్థిరపడ్డారు.ఇదిలా ఉంటే ఆవిడ మీద చీటింగ్ కేసు కూడా ఉందని ఈమధ్య వెలుగులోకి వచ్చింది.

బెంగళూరులోని పి ఎం సి ఆడ్ పోలీస్ స్టేషన్లో సింధు మీనన్ తో పాటు వాళ్ల సోదరుల మీద కూడా చీటింగ్ కేస్ ఫైల్ అయింది.అసలు మ్యాటర్ ఏంటి అని ఆరా తీస్తే బెంగళూరులోని జూబీమెంట్ మోటార్స్, ఎక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పి ఎం సి ఆడ్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఆమె 36 లక్షల లోన్ తీసుకున్నారని దానికి సంబంధించిన వడ్డీ గాని అసలు గాని చెల్లించకుండా తిరుగుతున్నారని వాళ్లు సింధు మీనన్ మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.

అలాగే తను లోన్ తీసుకున్నప్పుడు వాళ్లకి సబ్మిట్ చేసిన పత్రాలు కూడా నకిలీవని గుర్తించారు దీంతో సింధు మీనన్ మీద కేసు పెట్టి ఆవిడని విచారణకు పిలవాలని ప్రయత్నం చేస్తున్నారు అయిన కూడా ఆవిడ వేరే దేశంలో ఉండటంవల్ల రాలేకపోతుంది దీంతో వాళ్ళ బ్రదర్ అయిన కార్తికేయని విచారిస్తున్నారు.కానీ ఈ విషయం పైన సింధుమీనన్ స్పందిస్తూ తను ఏ బ్యాంకు లో లోన్ తీసుకోలేదని ఏ బ్యాంకు కి తను పత్రాలను కూడా పంపించలేదని వాళ్ల బ్రదర్స్ తన పేరుతో నకిలీ పత్రాలను సృష్టించి లోన్ తీసుకుని ఉంటారని ఆవిడ తన సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారు అని వినికిడి.కానీ ఒకప్పుడు మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందిన సింధు మీనన్ ఇప్పుడు ఇలా బ్యాంకులను మోసం చేయడం అనేది సరైన పద్ధతి కాదని చాలామంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు