టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్( Director Puri Jagannath ) గురించి మనందరికీ తెలిసిందే.తెలుగులో ఎన్నో మంచి మంచి సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు పూరి జగన్నాథ్.
ఆ తరువాత మధ్యలో కెరియర్ కాస్త డల్ అయినప్పటికీ ఆపై మళ్లీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.ఇకపోతే ప్రస్తుతం పూరి జగన్నాథ్ హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను తెరకెక్కిస్తూ దూసుకుపోతున్నారు పూరి జగన్నాథ్.
ఇది ఇలా ఉంటే తాజాగా పూరి జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలు చేసిన మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.మన శరీరానికి ఏదైనా గాయమైతే మన బాడీ దాన్ని తగ్గించే పనిలో పడిపోతుంది.కొన్ని దెబ్బలు తగ్గడానికి రోజులు పడుతుంది.
మరికొన్ని నయం కావడానికి వారాలు పట్టవచ్చు.కానీ, గాయమైతే తగ్గిపోతుంది.
అలాగే ఒక్కోసారి మన మనసుకు దెబ్బ తగులుతుంది.కన్నవాళ్లు చనిపోవచ్చు, కష్టానికి ప్రతిఫలం దక్కకపోవచ్చు, నమ్మినవాళ్లు మోసం చేయవచ్చు.
వీటివల్ల మనసుకు తగిలిన గాయాన్ని మనమే నయం చేసుకోవాలి.అది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది.
ఏం జరిగినా.ఎంత అనర్థం జరిగినా త్వరగా మాములు మనిషిగా మారాలి.

మానసికంగా దృఢంగా ఉండాలి.రోజుల తరబడి ఏడుస్తూ ఉండకూడదు.ఎంత ఏడ్చినా ఉపయోగం లేనప్పుడు, జరిగిన నష్టం భర్తీ కానప్పుడు ఎందుకు ఏడవాలి? వీలైనంత త్వరగా అందులోనుంచి బయటకు రావాలి అని తెలిపారు పూరి జగన్నాథ్.పక్కవారి సానుభూతి కోసం ఎప్పుడూ ఎదురు చూడవద్దు.
మనల్ని ఎవరూ ఓదార్చకూడదు.మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి.
కష్టం వచ్చినప్పుడు బాగా ఏడవండి.కానీ, వెంటనే పనిలో బిజీగా మారండి.
ప్రేమలో విఫలమైన కొందరు మద్యానికి బానిసలవుతారు.దయచేసి అలా చేయకండి.
అది చాలా పిచ్చి పని.ఎంత నష్టం వచ్చినా తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి.ఎంత కష్టం వచ్చినా ఒత్తిడిగా భావించొద్దు.అన్నం తినడం మానొద్దు.నీళ్లు తాగడం ఆపొద్దు.కావాల్సినంత నిద్ర పోవాలి.
మన శరీరం కోరుకునే కనీస అవసరాలు తీర్చాలి.అలా చేస్తేనే మనం కోలుకుంటాం అని ఆయన చెప్పుకొచ్చారు.