కాపీ కొట్టి సినిమా తీసి బొక్క బోర్లా పడ్డ స్టార్ హీరోలు !

ఏదైనా సినిమా విజయం సాధించి ట్రెండ్ సెట్టర్ గా నిలబడ్డ తర్వాత దాన్ని చూసి ఆదర్శంగా తీసుకొని మరికొన్ని సినిమాలు అదే తరహా జోనర్ లో వస్తూ ఉంటాయి.ఓకే జోనర్ లో ఎన్నో సినిమాలు రావడం పెద్ద విషయం ఏమీ కాదు.

 Tollywood Movies Copied By Another Heros Panchakshari Puli Okka Magadu Shakti De-TeluguStop.com

కానీ ఒకే సినిమా కథను కాస్త అటు ఇటుగా మార్చి తేస్తేనే అసలు సమస్య.అలా కాపీ కొట్టి తీసిన సినిమాలు విజయవంతం అయినట్టు చరిత్రలో ఎక్కడ లేదు.మరి అలా ఒకే రకమైన కథతో సినిమా తీసి బొక్క బోర్లా పడ్డ ఆ స్టార్ హీరోలు ఎవరు ? వారు తీసిన సినిమాలు ఎంటి అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పంచాక్షరి

Telugu Anushka Shetty, Arundhati, Baahubali, Balakrishna, Bharateeyudu, Vijay, J

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో వచ్చిన అరుంధతి( Arundhati ) బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.ఇదే సినిమా కథతో ఇంచుమించు అలాగే పంచాక్షరి సినిమా( Panchakshari Movie ) తీసిన అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది.ఈ రెండు సినిమాల్లో అనుష్క నే హీరోయిన్ గా నటించడం విశేషం.

ఒక్క మగాడు

Telugu Anushka Shetty, Arundhati, Baahubali, Balakrishna, Bharateeyudu, Vijay, J

డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో కమల్ హాసన్ హీరోగా నటించి ఇండియా లో అతి పెద్ద విజయం అందుకున్న సినిమా భారతీయుడు.( Bharateeyudu ) ఈ సినిమాలో కమల్ ఎంతో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.అయితే ఇదే కథను బాలకృష్ణ హీరోగా ఒక్క మగాడు( Okka Magaadu ) అనే పేరు తో తెలుగు లో తీయగా అది డిజాస్టర్ అయ్యింది.

శక్తి

Telugu Anushka Shetty, Arundhati, Baahubali, Balakrishna, Bharateeyudu, Vijay, J

మగధీర( Magadheera ) సినిమా రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శత్వంలో తెరకెక్కి ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ సినిమాకు కాస్త మసాలా దట్టించి శక్తి( Shakti ) అనే పేరుతో మెహర్ రమేష్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా తీస్తే ఇప్పటికి ఎన్టీఆర్ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది.

పులి

Telugu Anushka Shetty, Arundhati, Baahubali, Balakrishna, Bharateeyudu, Vijay, J

బాహుబలి( Baahubali ) సినిమా విడుదల అయ్యి బ్రహ్మాండమైన విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత అదే సినిమా కథకు కొంచం మార్పులు చేసి తమిళ్ లో హీరో విజయ్ కుమార్ పులి( Puli Movie ) అనే పేరుతో తీస్తే అది దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube