ఇటీవల రోజుల్లో వయసు సంబంధం లేకుండా కోట్లాది మందిని శారీరకంగానే కాకుండా మానసికంగానూ తీవ్రంగా కలవర పెడుతున్న సమస్య ఏదైనా ఉందా అంటే.అది అధిక బరువే.
అందులో ఎటువంటి సందేహం లేదు.బరువు పెరగడం వల్ల గుండె పోటు, మధుమేహం, రక్తపోటు ఇలా వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు రెట్టింపు అవుతాయి.
అదే సమయంలో ఇరుగు పొరుగు వారి సూటి పోటి మాటలు మరింత వేదనకు గురి చేస్తాయి.అందుకే పెరిగిన బరువు తగ్గించుకోవడం కోసం నానా పాట్లు పడుతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే మూడు అలవాట్లను వదులుకుంటే.చాలా అంటే చాలా సులభంగా బరువు తగ్గుతారు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మూడు అలవాట్లు ఏంటో తెలుసుకుందాం పదండీ.
సాధారణంగా కొందరు ఆకలి వేయకపోయినా తరచూ ఏదో ఒకటి తింటూనే ఉంటారు.
ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది.ఇలా తినడం వల్ల శరీరంలో క్యాలరీల సంఖ్య భారీగా పెరిగిపోతుంది.
అందుకే ఆకలి వేసినప్పుడే ఫుడ్‌ను తీసుకోవాలి.అది కూడా కొంచెం కొంచెం మొత్తంలో మాత్రమే తీసుకోవాలి.
బద్ధకం. దీన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత వేగంగా బరువు తగ్గుతారు.బద్ధకం వల్ల ఏ పని చేయలేకపోతుంటారు.ముఖ్యంగా వ్యాయామాల విషయంలో బద్ధకం మరింత మొండిగా వ్యవహరిస్తుంటుంది.
దాంతో రోజూ వ్యాయామం చేయాలనుకున్నా, బద్ధకం వల్ల అటువైపు అడుగులు వేయలేకపోతుంటారు.అందుకే బద్ధకాన్ని వదిలించుకుని రోజూ వర్కవుట్లు చేస్తే సూపర్ ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవుతారు.
ఇక మూడొవది.ఒత్తిడి. ఎంత ఆరోగ్యంగా ఉన్న మనిషిని అయినా చిత్తు చేసే సత్తా ఒత్తిడికి ఉంది.అధిక బరువుకి ఒత్తిడి కూడా ఒక కారణంగా చెబుతుంటారు.
అందుకే ఒత్తిడిని వీలైనంత వరకు తగ్గించుకోవాలి.తద్వారా మీ శరీర బరువు చక్కగా అదుపులోకి వస్తుంది.