పదేళ్లు ఎన్డీఏ చేసిన అభివృద్ధిని మీరంతా చూశారని ప్రధాని మోదీ( PM Modi ) అన్నారు.జహీరాబాద్ లో ( Zaheerabad ) బీజేపీ నిర్వహించిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా త్రిబుల్ ఆర్ దేశానికి పేరు తెస్తే.తెలంగాణకు కాంగ్రెస్ ( Congress ) ఆర్ఆర్ ట్యాక్స్ తెచ్చిందని మోదీ ఎద్దేవా చేశారు.
ఆర్ఆర్ ట్యాక్స్ తో ఢిల్లీకి నల్లధనం చేరుతోందన్నారు.ఈ క్రమంలో ఆర్ఆర్ ట్యాక్స్ ను అడ్డుకోకపోతే సర్వ నాశనమేనని పేర్కొన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ వస్తే మన వారసత్వ సంపద నుంచి కూడా ట్యాక్స్ వసూలు చేస్తుందని తెలిపారు.గతంలో బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా దోచుకుందో మీకు తెలుసన్న మోదీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ దోచుకుందని ఆరోపించారు.అయినా కాళేశ్వరం దోపిడీపై కాంగ్రెస్ మాట్లాడటం లేదన్నారు.ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరూ తోడు దొంగలేనని తెలిపారు.







