అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న ఆ ఒక్కటీ అడక్కు( Aa Okkati Adakku ) సినిమా రిలీజ్ కు మరో 3 రోజుల సమయం మాత్రమే ఉంది.అల్లరి నరేష్ మార్క్ ఎంటర్టైన్మెంట్, కామెడీ టైమింగ్ తో ఈ సినిమా తెరకెక్కడంతో అల్లరి నరేష్ కు మరో భారీ హిట్ ఖాయమని తేలిపోయింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో అల్లరి నరేష్( Allari naresh ) మాట్లాడుతూ నాన్న చనిపోయిన తర్వాత ఎదురైన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు.
నాంది సినిమా కరోనా సమయంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిందని నరేష్ పేర్కొన్నారు.జంబ లకిడి పంబ సినిమాను రీమేక్ చేస్తారా అంటే నేను చేయనని చెప్పానని ఆయన తెలిపారు.ప్రూవ్ అయిన సినిమాను తీయాలనుకుంటే చెడగొట్టకుండా తీయాలని నరేష్ చెప్పుకొచ్చారు.
అహ నా పెళ్లంట( Aha Naa Pellanta ) టైటిల్ ను రామానాయుడు గారి అనుమతి తీసుకొని ఫిక్స్ చేశామని ఆయన తెలిపారు.
సినిమాకు అదే టైటిల్ బాగుంటుందని అనిపిస్తే ఆ టైటిల్ ను ఉపయోగించుకోవడంలో తప్పు లేదని అల్లరి నరేష్ పేర్కొన్నారు.నాన్నతో నేను ప్రతి విషయం మాట్లాడేవాడినని నాన్న ఫ్రెండ్లీగా ఉండేవారని ఆయన తెలిపారు.తప్పు చేసినా చెప్పే స్వేచ్చను నాన్న ఇచ్చారని అల్లరి నరేష్ వెల్లడించారు.
ఇండస్ట్రీలో 1000 మందిలో ఒక్కరే సక్సెస్ అవుతారని నాన్న చెప్పారని ఆయన అన్నారు.అమ్మ మొహమాటం లేకుండా సినిమాల విషయంలో అభిప్రాయం చెబుతారని నరేష్ వెల్లడించారు.
నాన్న చనిపోయిన తర్వాత నేను కొన్ని విషయాలలో మారానని నరేష్ తెలిపారు.నాన్న మరణం తర్వాత బాధ్యతలు నాపై పెరిగాయని నరేష్ పేర్కొన్నారు.
నాన్న చనిపోయిన తర్వాత ఏడాది పాటు సైలెంట్ అయ్యానని నరేష్ వెల్లడించారు.వయస్సుతో పాటు కొంత మెచ్యూరిటీ వచ్చిందని నరేష్ పేర్కొన్నారు.
అల్లరి నరేష్ చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.