సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఎంతోమంది సక్సెస్ అందుకున్నటువంటి గీతూ రాయల్( Geethu Royal ) అనంతరం బిగ్ బాస్ ( Bigg Boss ) అవకాశాన్ని అందుకున్నారు.ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి ఈమె ఊహించని విధంగా తొమ్మిదవ వారంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చారు.
ఇలా సీజన్ సిక్స్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి గీతూ అనంతరం సీజన్ సెవెన్ బజ్ కార్యక్రమానికి జాగ్రత్తగా వ్యవహరించారు.
మరోవైపు ఈమె యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ విధంగా గీతూ రాయల్ తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉండేవారు అయితే తాజాగా ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసినటువంటి ఒక వీడియో అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది.ఈమె ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని 40 ఏళ్లకే చనిపోతారంటూ డాక్టర్లు చెప్పినట్టు ఈ వీడియోలో తెలియజేశారు.
ఈమెకు చిన్న గాయం అయిందట అయితే ఆ గాయం ఎన్ని రోజులైనా మానకపోవడంతో పెద్ద హాస్పిటల్ కి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారట.అయితే ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని తెలిపారు.ఈ వ్యాధికి రెండు సంవత్సరాల పాటు ట్రీట్మెంట్ తీసుకోవాలని అలాగే ప్రతిరోజు ఇంజక్షన్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పినట్లు తెలిపారు.అలాగే పూర్తిగా తన వ్యవహార శైలి కూడా మార్చుకోవాలని తెలిపారు.
సరైన సమయానికి నిద్ర తిండి లేకపోతే 40 సంవత్సరాల వయసుకే చనిపోతారంటూ డాక్టర్లు చెప్పినట్లు ఈ సందర్భంగా గీతూ రాయల్స్ చేసినటువంటి ఈ కామెంట్స్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.అయితే ఈ విషయం తెలిసి తను డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను అంటూ ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.