ప్రకాశం జిల్లా టంగుటూరులో సీఎం జగన్ ( CM Jagan )ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపక్ష నేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నాయకుడిపై ప్రజల్లో నమ్మకం ఉండాలని సీఎం జగన్ అన్నారు.మాట ఇస్తే నిలబెట్టుకుంటాడన్న నమ్మకం ప్రజల్లో ఉండాలన్నారు.పేదవాడి తలరాతను మార్చే ఎన్నికలు ఇవని చెప్పారు.14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి పేరు చెబితే ఒక్క పథకమైన గుర్తొస్తుందా అని ప్రశ్నించారు.చంద్రబాబు( Chandrababu )కు ఓటు వేస్తే మన సంక్షేమ పథకాలు( Welfare schemes ) ఆగిపోతాయని తెలిపారు.గతంలో చంద్రబాబు వస్తే జాబ్ వస్తుందని ఊదరగొట్టారన్న సీఎం జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు.
చంద్రబాబు రిపోర్ట్ బోగస్ కాదా అని నిలదీశారు.ఈ క్రమంలో చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ చంద్రముఖిని పిలిచినట్లేనని విమర్శించారు.







