పదో తరగతి, ఇంటర్ పరీక్షలలో సేమ్ మార్క్స్ సాధించిన ట్విన్ బ్రదర్స్.. గ్రేట్ అంటూ?

పది, ఇంటర్ పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తే కెరీర్ పరంగా సులభంగా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.అయితే ట్విన్ బ్రదర్స్, ట్విన్ సిస్టర్స్ పరీక్షలలో సైతం సమానంగా మార్కులు సాధించడం అరుదుగా మాత్రమే జరుగుతుంది.

 Telangana Twin Brotheres Inspirational Success Story Details Here Goes Viral In-TeluguStop.com

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామ్, లక్ష్మణ్ ( Ram , Lakshman ) కవలలు కాగా తాజాగా విడుదలైన ఫలితాలలో వీళ్లిద్దరూ మంచి మార్కులు సాధించడం గమనార్హం.v

పదో తరగతిలో వీళ్లిద్దరికీ 10కు 10 పాయింట్లు వచ్చాయి.

పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన ఈ ఇద్దరు అన్నాదమ్ములు ఇంటర్ లో ఒకరు 983 మార్కులు సాధిస్తే మరొకరు 981 మార్కులు సాధించారు.రామ్, లక్ష్మణ్ ఇంటర్ పరీక్షలో సైతం మంచి మార్కులు సాధించడం ద్వారా ఎంతోమంది ప్రశంసలు అందుకుంటున్నారు.

ఇద్దరూ చూడటానికి దాదాపుగా ఒకే రూపంలో ఉంటారు.

Telugu Lakshman, Manjula, Telangana Twin, Telanganatwin, Veerabhadraiah-Inspirat

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన వీరభద్రయ్య, మంజుల దంపతులకు కవలలు జన్మించగా ఒకే రూపంలో పుట్టిన ఇద్దరికీ రామ్ లక్ష్మణ్ అని పేర్లు పెట్టారు.బాల్యం నుంచి రామ్, లక్ష్మణ్ చదువులో రాణిస్తూ ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ కెరీర్ పరంగా అంతకంతకూ సక్సెస్ అయ్యారు.భవిష్యత్తులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా స్థిరపడాలని రామ్, లక్ష్మణ్ భావిస్తుండటం గమనార్హం.

Telugu Lakshman, Manjula, Telangana Twin, Telanganatwin, Veerabhadraiah-Inspirat

ఆత్మకూరు ఆదర్శ పాఠశాలలో ఇంటర్ వరకు చదువుకున్న ఈ అన్నాదమ్ములు కష్టపడి పట్టుదలతో ప్రిపేర్ అయితే లక్ష్యాన్ని సాధించడం సులువేనని ప్రూవ్ చేస్తున్నారు.ఈ ట్విన్ బ్రదర్స్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని ఎన్నో విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.రామ్, లక్ష్మణ్ ఇద్దరూ మంచి మార్కులు సాధించి తల్లీదండ్రులకు సైతం మరింత మంచి పేరును తెచ్చిపెడుతున్నారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రామ్, లక్ష్మణ్ టాలెంట్ కు నెటిజన్లు ఎంతగానో ఫిదా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube