జయసుధ నిర్మాతగా పట్టుబట్టి తీసిన వెనక ఇంత కథ నడిచిందా.. ?

కొంత మంది చేసే సాయం ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంటుంది.చిన్న సాయమే అయినా పెద్ద ప్రభావం చూపిస్తుంది.

 Untold Facts About Muthyala Subbayya And Jayasudha Movie, Jayasudha, Mutyala Sub-TeluguStop.com

తన జీవితంలోనూ అలాంటి ఘటన జరిగిందంటాడు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య.తన మిత్రులు శ్రీనివాసరెడ్డి తనకు ఇచ్చిన గౌరవాన్ని అస్సలు మర్చిపోలేను అంటాడు ఆయన.ఇంతకీ శ్రీనయ్య ఎవరు? ఆయన చేసిన సాయం ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన మామగారు సినిమా మంచి విజయం సాధించింది.

ఈ సినిమా తర్వాత కలికాలం అనే సినిమా చేయాలనుకున్నాడు తను.అయితే ఈ సినిమా చేసేందుకు ఏ నిర్మాత ముందుకు రాలేదు.దీంతో గతంలో ఎప్పుడో తనతో సినిమా చేస్తానని చెప్పిన శ్రీనయ్య గుర్తుకు వచ్చాడు.అప్పట్లో తనతో సినిమా చేస్తానంటే వద్దు.బాగా డబ్బు సంపాదించు.అప్పుడు చేద్దామని చెప్పాడు సుబ్బయ్య.

ఇప్పుడు అదే శ్రీనయ్య గుర్తుకు వచ్చాడు.ఫోన్ చేసి విషయం చెప్పాడు.

మంచి కథ… కానీ సినిమా నిర్మించేందుకు ఎవరు ముందుకు రావడం లేదని చెప్పాడు.  విషయం తెలుసుకున్న శ్రీనయ్య.

చేద్దామని చెప్పాడు.అయితే వెంటనే  ఆరు లక్షలు పంపించాలన్నాడు.

జయసుధకు కథ చెప్తున్నాం.నచ్చితే అడ్వాన్స్ ఇస్తామని చెప్పాడు.

ఓకే చెప్పాడు.

Telugu Jayasudha, Kalikaalam, Mamagaru, Seenayya, Tollywood, Untold Story-Telugu

మరుసటి రోజు కథా రచయిత మధుతో కలిసి జయసుధ ఇంటికి వెళ్లాడు సుబ్బయ్య.మధు ఆమెకు కథ చెప్పాడు.ఆమె ఓకే చెప్తే సినిమా సగం హిట్ అయినట్లు అనుకున్న సుబయ్య.

కానీ తను రెండు రోజుల సమయం ఇవ్వాలని చెప్పింది.సరే అన్నాడు.

జరిగిన విషయం శ్రీనయ్యకు చెప్పాడు.ఒక్కరోజు ముందు చెప్తే డబ్బులు అరేంజ్ చేస్తానన్నాడు తను.

రెండు రోజుల తర్వాత మళ్లీ జయసుధ దగ్గరకు వెళ్లాడు సుబ్బయ్య.నిర్మాత ఎవరు అని అడిగింది జయసుధ.తన మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పాడు.
 

Telugu Jayasudha, Kalikaalam, Mamagaru, Seenayya, Tollywood, Untold Story-Telugu

 కానీ.  ఈ సినిమా తన సొంత సంస్థ అయిన జేకే బ్యానర్ లో ఈ సినిమా చేయాలని కోరింది.కానీ శ్రీనయ్యకు మాట ఇచ్చాను కదా అనుకున్నాడు సుబ్బయ్య.

మీరు అనుకున్న బడ్జెట్ లోనే సినిమా చేయాలని చెప్పింది.  తాము జోక్యం చేసుకోమని వెల్లడించింది.

తనకు సమయం కావాలని అడిగాడు సుబ్బయ్య.విషయం శ్రీనయ్యకు చెప్పాడు.

మరో మంచి సినిమా కలిసి చేద్దామన్నాడు.తను కూడా నీ ఇష్టం అన్నాడు.

తన అర్థం చేసుకునే గుణానికి లోలోపల థ్యాంక్స్ చెప్పుకున్నాడు సుబ్బయ్య.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube