మలబద్ధకం తీవ్రంగా వేధిస్తోందా.. రోజూ ఒక గ్లాసు మజ్జిగ ఇలా తీసుకోండి దెబ్బకు ఎగిరిపోతుంది!

మలబద్ధకం.( Constipation ).దీని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.చాలా మంది చాలా కామన్ గా ఎదుర్కొనే సమస్యల్లో ఇది ఒకటి.

 Taking A Glass Of Buttermilk A Day Like This Will Cure Constipation , Health-TeluguStop.com

అయితే మలబద్ధకం గురించి ఎవరు బయటకు చెప్పుకునేందుకు ఇష్టపడరు.అలా అని నిర్లక్ష్యం చేస్తే.

దాని కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.మలబద్ధకం వ‌ల్ల‌ ముఖ్యంగా జీర్ణాశయ వ్యాధులు, ఆక‌లి లేక‌పోవ‌డం, హైపర్‌టెన్షన్, పైల్స్, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Telugu Buttermilk, Tips, Latest-Telugu Health

అందుకే వీలైనంత వేగంగా మలబద్ధకం సమస్యను( Constipation ) వదిలించుకోవాలి.మిమ్మల్ని కూడా మలబద్ధకం తీవ్రంగా వేధిస్తుందా.? డోంట్ వర్రీ రోజు ఒక గ్లాసు మ‌జ్జిగ‌ను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే ఆ సమస్య దెబ్బకు ఎగిరిపోతుంది.అందుకోసం ముందుగా ఒక చిన్న కీర దోసకాయను ( Green cucumber )తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు కీరా దోసకాయ ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్క‌లు, హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, నాలుగు పుదీనా ఆకులు ( Mint leaves )లేదా రెండు స్పూన్లు కొత్తిమీర వేసుకోవాలి.

Telugu Buttermilk, Tips, Latest-Telugu Health

అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు( Ginger slices ), రుచికి సరిపడా ఉప్పు మరియు ఒకటిన్నర గ్లాసు చిక్కని మజ్జిగ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఆపై గ్రైండ్ చేసుకున్న మజ్జిగను ఫిల్టర్ చేసుకుని సేవించాలి.ఈ కీర బటర్ మిల్క్ లో కావాలి అంటే మీరు ఐస్ క్యూబ్స్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు.

రోజు ఈ విధంగా మజ్జిగను భోజనం తర్వాత ఒక గ్లాసు చొప్పున తీసుకుంటే ఎలాంటి మలబద్ధకం అయినా దెబ్బకు ఎగిరిపోతుంది.అలాగే తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.

గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.అంతేకాదు, ఈ కీర బటర్ మిల్క్( Butter milk ) ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది.

అల్సర్ సమస్య తగ్గు ముఖం పడుతుంది.నీరసం, అలసట వంటివి సైతం వేధించకుండా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube