పాపులను శిక్షించి, మంచి వారిని రక్షించడమే లక్ష్యంగా ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణావతారం ఎత్తాడు.ఎంతో మంది పాపులను అంతం చేశాడు.
అటువంటి దేవదేవుడు జన్మించిన గొప్ప రోజున నిర్వహించేదే జన్మాష్టమి.ఈ సందర్భంగా తెలుగు సినిమా పరిశ్రమలో శ్రీకృష్ణుడి పాత్రల్లో మెరిసిన నటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
*ఎన్టీఆర్
తెలుగు సినిమా పరిశ్రమలో కృష్ణుడు అనగానే మొదట గుర్తొచ్చేది మహా నటుడు ఎన్టీఆర్.ఆయన సినిమా రూపాన్నే జనాలు భగవంతుడి స్వరూపంగా భావించడం విశేషం.
*ఏఎన్నాఆర్
ఏఎన్నాఆర్ తన సినీ జీవితంలో ఏ సినిమాలో శ్రీకృష్ణుడి పాత్ర వేయలేదు.అయితే.గోవుల గోపన్న సినిమాలో మాత్రం ఓ పాటలో శ్రీకృష్ణుడి వేషంలో కనిపిస్తాడు.
*కాంతారావు
శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ తర్వాత జనాలు మెప్పించిన నటుడు కాంతారావు.ఆయన తన నటనతో ఆ పాత్రకే వన్నె తెచ్చిన వ్యక్తి.
*కృష్ణ
బాపు దర్శకత్వంలో వచ్చిన సాక్షి సినిమా కృష్ణ శ్రీకృష్ణుడిగా కనిపిస్తాడు.
*శోభన్ బాబు
తెలుగు సినిమాల్లో శ్రీకృష్ణుడిగా నటించిన మరో హీరో శోభన్ బాబు.బుద్దిమంతుడు, కురుక్షేత్రం సినిమాల్లో ఆయన ఈ వేశంలో కనిపించాడు.
*విజయ నిర్మల
పాండురంగ మహత్యం సినిమాలో విజయ నిర్మల చిన్ని కృష్ణుడి పాత్రలో నటించాడు.
*హరికృష్ణ
హరికృష్ణ కూడా శ్రీకృష్ణావతారం మూవీలో బాలకృష్ణుడిగా వెండితెరపై సందడి చేశాడు.
*శ్రీదేవి
యశోదకృష్ణ సినిమాలో శ్రీదేవి బాలకృష్ణుడిగా యాక్ట్ చేసింది.
* బాలకృష్ణ
శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడులో శ్రీకృష్ణుడిగా నటించాడు బాలకృష్ణ.
*రాజేంద్రప్రసాద్
కన్నయ్య కిట్టయ్య సినిమాలో రాజేంద్రప్రసాద్ శ్రీకృష్ణుడిగా కనిపిస్తాడు.
*నాగార్జున
కృష్ణార్జున సినిమాలో నాగార్జున శ్రీకృష్ణుడి పాత్ర కనిపిస్తాడు.
*పవన్ కల్యాణ్
గోపాల గోపాల సినిమాలో పవన్ కల్యాణ్ కృష్ణుడిగా నటించాడు.
* మహేశ్ బాబు
మహేశ్ బాబు యువరాజు సినిమాలో ఒక పాటలో శ్రీకృష్ణుడిగా కనిపిస్తాడు.
* సునీల్
అందాలరాముడు సినిమాలో శ్రీకృష్ణుడిగా సునీల్ అలరిస్తాడు.
* రవిచంద్రన్
కన్నడలో తెరకెక్కిన కురుక్షేత్ర సినిమాలో రవిచంద్రన్ శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించాడు.ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేసి రీలీజ్ చేశాడు.
.