టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఇలియానా( Ileana ) ఒకరు కాగా ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్లు తగ్గాయి.తెలుగులో ఇలియానాకు కొత్త సినిమా ఆఫర్లు వచ్చే అవకాశాలు సైతం కనిపించడం లేదు.అయితే బాలీవుడ్ సినిమాలో నటించడం వల్లే తెలుగులో ఆఫర్లు తగ్గాయని ఇలియానా పేర్కొన్నారు.2012 సంవత్సరంలో అనురాగ్ బసు డైరెక్షన్ లో తెరకెక్కిన బర్ఫీ సినిమాలో ప్రధాన పాత్ర పోషించానని ఆమె అన్నారు.
ఆ సినిమాలో నటించే సమయానికి సౌత్ లో నేను ఫుల్ బిజీ అని ఇలియానా పేర్కొన్నారు.బర్ఫీ మూవీ( Barfi Movie ) కథ చాలా నచ్చిందని అలాంటి సినిమాలలో అవకాశాలు అరుదుగా వస్తాయని అనిపించిందని ఇలియానా పేర్కొన్నారు.
ఆ సినిమాను వదులుకోవడం తెలివితక్కువతనం అని భావించానని ఆమె చెప్పుకొచ్చారు.అందుకే ఆ సినిమాను ఓకే చేశానని ఇలియానా పేర్కొన్నారు.

ఆ సినిమా నా ఊహలకు అనుగుణంగా ప్రేక్షకాదరణ పొందానని ఇలియానా వెల్లడించారు.ఆ సమయంలో నేను సౌత్ సినిమాలలో( South Movies ) నటించనని భావించి నాకు ఆఫర్లు ఇవ్వలేదని ఇలియానా తెలిపారు.బాలీవుడ్ ఇండస్ట్రీకి( Bollywood Industry ) వెళ్లిన తర్వాత సినిమాల ఎంపిక విషయంలో మారానని ఆమె చెప్పుకొచ్చారు.చాలా సెలెక్టివ్ గా వ్యవహరించానని ఆమె అన్నారు.ఏ పని అయినా నేను నిజాయితీగా చేస్తానని ఇలియానా పేర్కొన్నారు.

నా పాత్రకు 100 శాతం న్యాయం చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు.ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా నాకు రావాల్సిన గుర్తింపు రాలేదని దానికి కారణం కూడా తెలియదని ఆమె తెలిపారు.ఇలియానా చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇలియానా రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఇలియానాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.







