భారీ ధరలకు చైతన్య తండేల్ డిజిటల్ రైట్స్ కైవసం చేసుకున్న నెట్ ఫ్లిక్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని వారసుడిగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటుడు నాగచైతన్య ( Nagachaitanya) ప్రస్తుతం డైరెక్టర్ చందు మొండేటి ( Chandoo Mondeti ) దర్శకత్వంలో తండేల్ ( Thandel ) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవల వరుస ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఈయన ఈసారి ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు.

 Nagachaitanya Thandel Movie Digital Rights Details Goes Viral, Thandel, Chandoo-TeluguStop.com

ఈ సినిమాలో నాగచైతన్య ఒక జాలరి పాత్రలో కనిపించబోతున్నారు.ఈ సినిమా నిజ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Telugu Chandoo Mondeti, Love Story, Nagachaitanya, Sai Pallavi, Thandel-Movie

ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా సాయి పల్లవి ( Sai Pallavi ) నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికి వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి లవ్ స్టోరీ సినిమా ఎంతో మంచి సక్సెస్ అయింది.ఈ సినిమా తర్వాత నాగచైతన్య పలు సినిమాలలో నటించడం పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు.తిరిగి ఇదే కాంబినేషన్లోనే సినిమా రావడంతో మరోసారి ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Telugu Chandoo Mondeti, Love Story, Nagachaitanya, Sai Pallavi, Thandel-Movie

ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.ఇకపోతే ఈ సినిమా డిజిటల్ రైట్స్( Digital Rights ) కి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమా అన్ని భాషలకు సంబంధించినటువంటి డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ ( Net Flixs ) వారు ఏకంగా 40 కోట్ల రూపాయలకు కైవసం చేసుకున్నారని తెలుస్తోంది.

ఈ సినిమా విడుదలైనటువంటి నాలుగు వారాలకే దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా ఈ సినిమా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తోంది.ఇలా ఈ సినిమా డిజిటల్ రైట్స్ 40 కోట్లకు అమ్మడు పోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.

ఇక ఈ సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube