కంటి చూపు త‌గ్గుతున్న‌ట్లు అనిపిస్తోందా? అయితే ఇది మీ డైట్‌లో ఉండాల్సిందే!

వయసు పెరిగే కొద్దీ కంటి చూపు సన్నగిల్లడం సర్వసాధారణం.కానీ ఇటీవల రోజుల్లో చాలా మందికి చిన్న వయసులోనే కంటి చూపు తగ్గుతుంది.

 This Is The Super Juice That Improves Eyesight! Super Juice, Improves Eyesight,-TeluguStop.com

అందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి.ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, స్మార్ట్ ఫోన్లు అధికంగా వినియోగించడం, ఒత్తిడి తరతర అంశాలు కంటి ఆరోగ్యాన్ని ప్ర‌భావితం చేస్తుంటాయి.

మీ కంటి చూపు కూడా తగ్గుతున్నట్లు అనిపిస్తోందా.? అయితే ఖ‌చ్చితంగా ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను మీ డైట్ లో చేర్చుకోవాల్సిందే.

జ్యూస్ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అలాగే కంటి చూపును మెరుగు ప‌ర‌చ‌డానికి సహాయపడుతుంది.మరి ఇంతకీ ఆ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా చిన్న సైజు కర్బూజ పండును తీసుకుని తొక్క చెక్కేసి వాటర్ తో శుభ్రంగా కడగాలి.

ఆ తర్వాత కర్బూజ పండులో ఉన్న గింజలను తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే చిన్న కీరా దోసకాయ తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండర్‌ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కర్బూజా ముక్కలు, కీర దోసకాయ ముక్కలు, చిటికెడు బ్లాక్ సాల్ట్, ఐదారు పుదీనా ఆకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె ను మిక్స్ చేస్తే టేస్టీ అండ్ హెల్తీ కర్పూజ కీరా జ్యూస్ సిద్ధమవుతుంది.

Telugu Eyes, Tips, Kharbuja, Kharbuja Kheera, Kheera-Telugu Health Tips

ఈ జ్యూస్ ను రోజులో ఏదో ఒక సమయంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.ముఖ్యంగా కంటి చూపును మెరుగుపరచడంలో ఈ జ్యూస్ అద్భుతంగా సహాయపడుతుంది.ఇతర కంటి సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నా తగ్గుముఖం పడతాయి.అలాగే ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది.మూత్రపిండాలు శుభ్రంగా మారతాయి.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ దూరం అవుతాయి.మరియు చర్మ ఆరోగ్యం సైతం రెట్టింపు అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube