సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబరు రెండో వారం ద్వితీయార్థం వరకు భారతదేశంలో నవరాత్రి ఉత్సవాలు జోరుగా జరిగాయి.ఈ సమయంలో ప్రజలు అందరూ కొత్త బట్టలు, వస్తువులు కొనుగోలు చేశారు.
అయితే వీటన్నింటి కంటే ఎక్కువగా వారు వాహనాలను కొనుగోలు చేశారని ఒక లేటెస్ట్ నివేదిక వెల్లడించింది.సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 5 మధ్య కాలంలో ఇండియాలో వెహికల్ రిటైల్ సేల్స్ 57 శాతం పెరిగాయి.అలా కేవలం 10 రోజుల్లో ఈ సేల్స్ 5.4 లక్షలకు చేరాయి.వాహన డీలర్ల సమాఖ్య ఫాడా ఈ విషయాన్ని తెలిపింది.
ఈ 10 రోజుల కాలంలో మొత్తం వాహనాల రిటైల్ విక్రయాలు 5,39,227గా రికార్డ్ అయ్యాయని ఆ రిపోర్టు వెల్లడించింది.2021 నవరాత్రి సమయంలో రిటైల్ విక్రయాలు 3,42,459గా నమోదయ్యాయి.కరోనా రాకముందు 2019లో ఇదే సమయంలో 4,66,128 రిటైల్ వాహనాలు సేల్ అయ్యాయి.
ఈ ఏడాది మాత్రం దాదాపు ఒక లక్ష ఎక్కువగా సేల్స్ జరిగాయి.దీపావళి ఫెస్టివల్ సందర్భంగా కూడా ఇలాగే అధిక సేల్స్ జరిగే అవకాశం ఉంది.
నవరాత్రి టైమ్లో టూవీలర్స్ రిటైల్ విక్రయాలు 3,69,020గా నమోదయ్యాయి.ఇదే సమయంలో 1,10,521 ప్యాసింజర్ వెహికల్స్ అమ్ముడయ్యాయి.కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు 22,437కు చేరాయి.త్రీ వీలర్లు 19,809 విక్రయించబడుతున్నాయి.ట్రాక్టర్లు 17,440 సేల్స్ రికార్డు చేశాయి.టాటా మోటార్స్ గత కొన్ని నెలలుగా వాహనం విక్రయాలలో నంబర్.1 ప్లేస్లో ఉంటుంది.సెప్టెంబరు క్వార్టర్లో ఈ కంపెనీ ఇంటర్నేషనల్ సేల్స్ 3,35,976గా రికార్డ్ కావడం విశేషం.