భారీ ధరలకు చైతన్య తండేల్ డిజిటల్ రైట్స్ కైవసం చేసుకున్న నెట్ ఫ్లిక్స్!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని వారసుడిగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటుడు నాగచైతన్య ( Nagachaitanya) ప్రస్తుతం డైరెక్టర్ చందు మొండేటి ( Chandoo Mondeti ) దర్శకత్వంలో తండేల్ ( Thandel ) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల వరుస ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఈయన ఈసారి ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ సినిమాలో నాగచైతన్య ఒక జాలరి పాత్రలో కనిపించబోతున్నారు.ఈ సినిమా నిజ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
"""/" /
ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా సాయి పల్లవి ( Sai Pallavi ) నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికి వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి లవ్ స్టోరీ సినిమా ఎంతో మంచి సక్సెస్ అయింది.
ఈ సినిమా తర్వాత నాగచైతన్య పలు సినిమాలలో నటించడం పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు.
తిరిగి ఇదే కాంబినేషన్లోనే సినిమా రావడంతో మరోసారి ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి.
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. """/" /
ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.
ఇకపోతే ఈ సినిమా డిజిటల్ రైట్స్( Digital Rights ) కి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమా అన్ని భాషలకు సంబంధించినటువంటి డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ ( Net Flixs ) వారు ఏకంగా 40 కోట్ల రూపాయలకు కైవసం చేసుకున్నారని తెలుస్తోంది.
ఈ సినిమా విడుదలైనటువంటి నాలుగు వారాలకే దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా ఈ సినిమా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తోంది.
ఇలా ఈ సినిమా డిజిటల్ రైట్స్ 40 కోట్లకు అమ్మడు పోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.
ఇక ఈ సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. .
ప్రపంచంలోనే అతి చిన్న ఇల్లు.. కేవలం 20 అడుగుల్లో అన్ని సౌకర్యాలతో ఇల్లు!