వైరల్ వీడియో: డాన్స్ చేస్తూ ఉన్నట్లుండి మృతి చెందిన అమ్మాయి.

ఈ మధ్యకాలంలో చాలామంది వారి పిల్లల పెళ్లిళ్ల కోసం ఎలాంటి వెనకడుగు వేయకుండా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకుంటూ పెళ్లిని అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు.అయితే ఒక్కోసారి అనుకోని సంఘటనలు వల్ల పెళ్లి కార్యక్రమంలో జరగాల్సిన శుభకార్యం కంటే అశుభకార్యాలు కూడా జరుగుతున్నాయి.

 Viral Video Of Girl Who Died While Dancing, Viral Video, Social Media, Dance, Gi-TeluguStop.com

ఇక అసలు విషయంలోకి వెళ్తే.పెళ్లి వేడుకలలో అంబరాన్ని అంటిన ఆనందాన్ని అనుభవిస్తున్న ఓ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది.

తన సోదరి పెళ్లికి ముందు జరిగిన హల్దీ వేడుకలో ( Haldi ceremony ) ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న 18 ఏళ్ల యువతి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని మీరట్‌ ( Meerut ) లో చోటుచేసుకుంది.డ్యాన్స్ చేస్తున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.కిందపడిపోయిన బాలికను బంధువులు ఆస్పత్రికి తరలించారు.

అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.మృతురాలి పేరు రిష్మా( Rishma ) .అమ్మాయి డాన్స్ చేస్తున్న సమయంలో పడిపోగానే ఛాతీ మీద చేయి వేసి అలాగే పడిపోయింది.ఈ మధ్య చాలామంది గుండె పోటు కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు.

ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి.వయస్సుతో సంబంధం లేకుండా ఈ మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ ఇంత చిన్న వయసులో అమ్మాయి డాన్స్ చేస్తున్న సమయంలో ఇలా జరగడం చాలా బాధాకరం అంటూ కామెంట్ చేస్తున్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube