ఎన్నికల్లో ఎక్కువ మంది పోటీ చేయండి .. ఇండో అమెరికన్లకు కమలా హారిస్ సూచనలు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు( America ) వలస వెళ్లిన భారతీయులు అన్ని రంగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా రాజకీయాల్లో మనవారు దూసుకెళ్తున్నారు.

 Vice President Kamala Harris Says More Indian Americans In Us Must Run For Elect-TeluguStop.com

గవర్నర్లు, సెనెటర్లు, చట్టసభ సభ్యులు, కాంగ్రెస్ సభ్యులు, మేయర్లుగా పలువురు భారతీయులు వున్నారు.ఇప్పుడు ఏకంగా అమెరికాలోని రెండో అత్యున్నత పదవిలో స్వయంగా భారత సంతతికి చెందిన కమలా హారిస్( Kamala Harris ) వుండటం మనందరికీ గర్వకారణం.

ఈ ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు, కాంగ్రెస్ ఎన్నికలు జరనున్నాయి.ఎప్పటిలాగే పలువురు భారతీయులు, భారత సంతతి నేతలు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కమలా హారిస్ కీలక వ్యాఖ్యలు చేశారు.అమెరికాలోని ఎన్నికైన కార్యాలయాల్లో భారతీయ అమెరికన్ల( Indian Americans ) సంఖ్య వారి పెరుగుతున్న జనాభాను ప్రతిబింబించదన్నారు.

మరింత మంది మైనారిటీలు ఎన్నికల్లో పొటీ చేయాలని ఆమె కోరారు.డెమొక్రాటిక్ పార్టీ థింక్ ట్యాంక్ అయిన ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ వార్షిక శిఖరాగ్ర సదస్సు ‘‘ Desis Decide ’’లో కమలా హారిస్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రజాప్రతినిధులుగా పోటీ చేస్తున్న భారతీయ అమెరికన్లకు నిధులు సమకూర్చడంలో ఈ సంస్థ కీలకపాత్ర పోషిస్తోంది.

Telugu Democratic, Desis, Impact, India Caucus, Indianamerican, Kamala Harris, K

ఏళ్లుగా ఎన్నికల ప్రక్రియలో భారతీయ అమెరికన్లు ఎక్కువ భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నారని.కానీ ఇప్పటికీ పెరుగుతున్న జనాభా పరిమాణాన్ని ఈ సంఖ్యలు ప్రతిబింబించడం లేదని కమలా హారిస్ అన్నారు.ప్రస్తుతం కాంగ్రెస్‌లో( Congress ) కేవలం ఐదుగురు భారతీయ అమెరికన్ సభ్యులు మాత్రమే ఉన్నారని.వారు డాక్టర్ అమీ బెరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్, శ్రీథానేదర్‌లు.2020లో యూఎస్ కాంగ్రెస్‌లో భారతీయ అమెరికన్ల సంఖ్య 10కి పెరుగుతుందని గతంలో ఇంపాక్ట్ చెప్పింది.

Telugu Democratic, Desis, Impact, India Caucus, Indianamerican, Kamala Harris, K

ఇంపాక్ట్( Impact ) చేస్తున్న పని అసాధారణమైనదని.ప్రతిదానికి, అది ప్రాతినిధ్యం వహించే ప్రతీదానికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నానని కమలా హారిస్ వెల్లడించారు.మీరు ఒంటరిగా లేరని తెలుసుకోండి.ఒక దేశంగా మనం ఇంకా చాలా చేయాల్సి వుందని ఆమె వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube