దశాబ్థాలుగా మీరు ఒక దేశంలో ఉండి.పన్నులు కడుతూ, ఎన్నికల్లో ఓటు కూడా వేస్తూ సడెన్‌గా మీరు ఆ దేశ పౌరులు కాదని తెలిస్తే ఆ ఫీలింగ్ ఎలా వుంటుందో వర్ణించడం కూడా కష్టమే.అచ్చం ఇలాంటి పరిస్ధితినే ఎదుర్కొంటున్నారు అమెరికాలోని ఫ్లోరిడా( Florida ) రాష్ట్రానికి చెందిన వ్యక్తి.66 ఏళ్ల జిమ్మీ క్లాస్ .( Jimmy Klass ) సోషల్ సెక్యూరిటీ పేమెంట్స్ నిమిత్తం దరఖాస్తు చేసుకోగా.తాను అమెరికా పౌరుడిని కాదని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు.
జిమ్మీ చిన్నప్పటి నుంచి అమెరికాలోనే నివసిస్తున్నాడు.అంతేకాదు అనేక ఫెడరల్ ఎన్నికల్లో ఓటు కూడా వేశాడు.
2020లో సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్( Social Security Administration ) నుంచి తాను తన ప్రయోజనాలను పొందాలని అనుకుంటున్నట్లు జిమ్మీ క్లాస్ అన్నాడు.అయితే న్యూస్ 6 క్లిక్ ఓర్లాండ్ ప్రకారం.
అతని నగదు ‘‘ఫ్రీజ్ ’’ అయినట్లుగా జిమ్మీకి సమాచారం అందింది.తాను చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నానని నిరూపించుకోలేనందున నగదును స్తంభింపజేసినట్లుగా తనకు నోటిఫికేషన్ వచ్చిందని ఆయన తెలిపారు.
జిమ్మీ క్లాస్ పూర్వీకులు జర్మనీలో నివసించగా.అతని తల్లి కెనడియన్.
అయినప్పటికీ అతని తండ్రి జన్మత: అమెరికాలో పుట్టినందున తాను యూఎస్ పౌరుడినేనని( US Citizen ) క్లాస్ ధీమాతో వున్నాడు.అతనిని 2 ఏళ్ల వయసులో 1960లో అమెరికాకు తీసుకొచ్చారు.
తన తండ్రి మూలాలు న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో( Brooklyn ) ఉన్నాయని.తనకు ఊహ తెలిసినప్పుడు తల్లిదండ్రులు బెవర్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని క్లాస్ గుర్తుచేశారు.లాంగ్ ఐలాండ్‌లోని టెనస్సీ అవెన్యూకి , అమ్మమ్మ పక్కింటికి మారామని ఆయన తెలిపారు.అంతేకాదు.కొన్నేళ్ల క్రితం యూఎస్ మెరైన్ కార్ప్స్‌లో( US Marine Corps ) చేరడానికి తనకు అర్హత కూడా లభించిందని క్లాస్ వెల్లడించారు.అలాగే ఓ పోలీస్ ఉద్యోగానికి కూడా అనుమతి లభించిందని .ఈ రెండు దరఖాస్తులు చేసినప్పుడు కఠినమైన తనిఖీలు, పుట్టు పూర్వోత్తరాలన్నీ చెక్ చేసినా తన పౌరసత్వంపై ఎలాంటి సందేహం వ్యక్తం చేయలేదని జిమ్మీ క్లాస్ గుర్తుచేశారు.
ఈ రెండు ఉద్యోగాలకు తాను ఎంపికైనప్పటికీ .తాను కొలువులో చేరలేదని , ఆ సమయంలో తనకు కొత్తగా పెళ్లయిందని, భార్య గర్భవతిగా వుందని జిమ్మీ అన్నారు.సోషల్ సెక్యూరిటీ కార్డ్ ద్వారా ఓటరుగానూ ( Voter ) రిజిస్టర్ కావడం, చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కూడా అతనికి ఉంది.
తాను పలు ఎన్నికల్లో ఓటు వేశానని .ఎఫ్‌బీఐ ప్రకారం ఇది ఫెడరల్ నేరమని కానీ తనను అరెస్ట్ చేయడానికి ఎప్పుడూ ఎవరూ రాలేదన్నారు.