ఈ మధ్యకాలంలో చాలాసార్లు ఒక ఫుడ్ ఆర్డర్ చేస్తే మరొక ఫుడ్ ఐటమ్ ని డెలివరీ చేయడం పొరపాటుగా మారాయి కొన్ని కంపెనీలకు.తాజాగా పూణే( Pune ) నగరానికి చెందిన ఓ వ్యక్తికి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ( Zomato ) సంస్థ తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది.
ఆ వ్యక్తి ఇటీవల పన్నీర్ బిర్యానీని( Paneer Biryani ) ఆర్డర్ చేయగా తనకు వచ్చిన ఫుడ్ పార్ట్స్ లో విప్పి ప్లేట్లో వేసుకుని తింటుండగా అతడికి వచ్చిన బిర్యానీలో చికెన్ పీస్ కనబడింది.దీంతో ఆ వ్యక్తి షాక్ గురయ్యాడు.
ఈ సందర్భంగా అతడికి జరిగిన అసౌకర్యం గురించి సోషల్ మీడియా వేదికగా పరిస్థితిని వివరించాడు.ఇందుకుగాను ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోను ట్యాగ్ చేశాడు.

పూణే నగరానికి చెందిన పంకజ్ శుక్లా( Pankaj Shukla ) అనే వ్యక్తి తనుకు ఎదురైన అనుభవాన్ని మొత్తం ట్వీట్ రూపంలో సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశాడు.అతను పీకే బిర్యానీ హౌస్ నుండి పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేశానని.అందులో తనకు చికెన్ పీస్( Chicken Piece ) కనిపించిందని తెలుపుతూ ఓ పోస్ట్ చేశాడు.అంతేకాకుండా ఈ పోస్టులో ఈ సందర్భంగా తనకి పూర్తి రీఫండ్ కూడా వచ్చిందని.
కాకపోతే., తాను పూర్తి శాఖకరమైన ఆహారనని దీనివల్ల తాను మా మత నియమాల ప్రకారం పాపం చేసినట్టే అంటూ భావించాడు.
దీంతో తన మతవిశ్వాసం దెబ్బతిన్నట్టే అని అనుకుంటున్నట్లుగా ట్వీట్ చేశాడు.

ఈ సందర్భంగా జొమాటో కస్టమర్ విభాగం అతనికి స్పందించింది.ఇందులో భాగంగా.హాయ్ పంకజ్.
ఎవరి విశ్వసలను దెబ్బతీయకపోవడమే మా నియమం అంటూ తెలుపుతూ., దానికి మా మొదటి ప్రాధాన్యం అని తెలిపింది.
అలాగే మీ ఆర్డర్ యొక్క ఐడి నెంబర్ అలాగే రిజిస్టర్ ఫోన్ నెంబర్ మాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి అంటూ సమాధానం తెలిపింది.ఈ విషయంపై తమ పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామంటూ జొమాటో రిప్లై ఇచ్చింది.
ఈ సందర్భంగా నెటిజన్స్ జొమాటో కంపెనీ పై కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు.







