సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రోజుకో రకరకాల వీడియోలు మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతున్నాయి.వాటిలో కొన్ని ఆకట్టుకునేవి, మరికొన్ని ఫన్నీగా ఉంటాయి.
మరికొందరు వ్యూస్, లైక్స్ పొందడానికి ఫన్నీ ప్రయోగాలు చేయడం ద్వారా ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తారు.ఐరన్ బాక్స్‌పై ఆమ్లెట్‌లు వండడం, ఎండలో హ్యాండిల్‌తో దోసెలు వేయడం లాంటి అనేకం మనం సోషల్ మీడియాలో( Social Media ) చూసాం.
ఇలాంటి వీడియో ఇప్పుడు మరొకటి పాపులర్ అవుతోంది.ఈ వీడియో చూస్తే మీరు మాత్రం వీడియో చూసి నవ్వు ఆపుకోలేరు.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.వైరల్ అయిన ఒక వీడియోలో, ఒక మహిళ దోమలను చంపడానికి బ్యాట్‌తో( Mosquito Bat ) బ్రెడ్ ముక్కలను కాల్చుతున్నట్టు చూపబడింది.ఆమె మంచం మీద దోమల బ్యాట్ తో కూర్చుని, దానిపై బ్రెడ్ ముక్కలు( Bread ) వేసింది.వేయించిన తర్వాత కూడా రుచికరంగా ఉన్నాయి.“బ్రెడ్ టోస్ట్( Bread Toast ) చేయడానికి ఇది ఒక కొత్త టెక్నిక్” అని కూడా వీడియో క్యాప్షన్ చేయబడింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఈ వీడియోను చుసిన అనేకమంది వెరైటీగా కామెంట్స్ చేస్తున్నారు.ఇందులో కొందరు `బ్రెడ్ విత్ మస్కిటో శాండ్‌విచ్ “ అంటుండగా, మరికొందరు “దోమల టేస్ట్ కూడా రుచి చూడవచ్చు“ అంటూ మరికొందరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.మరికొందరు.“దయచేసి ఇలాంటి ప్రయోగాలు చేయకండి అంటూ.ఇది కేవలం వ్యూస్, లైక్స్ కోసమే రూపొందించిన వీడియో“ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.







