రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరుగుతే ప్రథమ చికిత్స కొరకై తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటు ప్రథమ చికిత్స ప్రమాదం జరిగినప్పుడు వెంటనే వైద్యం చేసుకునే విధంగా ఫస్ట్ ఐడి కిట్స్ ను అశ్విని హాస్పిటల్ వైద్యులు
డాక్టర్ జి.సత్యనారాయణ స్వామి, మేనేజింగ్ డైరెక్టర్ జి అభినయ్ కుమార్ వారి సహకారంతో ఉపాధి కూలీలకు ఈ కిట్స్ ను అందజేయడం జరిగిందని, అలాగే ఎల్లారెడ్డిపేట మండలంలో కూడా అన్ని గ్రామాల్లో ఉపాధి పని చేస్తున్నటువంటి ఉపాధి కూలీలకు అందజేయడం జరుగుతుందని వారు ఈ సందర్భంగా తెలిపారు.







