వేసవికాలం( Summer ) వచ్చిందంటే చాలు ప్రజలు చల్లని పదార్థాలను తీసుకోవడానికి ఎంతగానో ఇష్టపడతారు.ముఖ్యంగా ఎండాకాలంలో ఎండ వేడిమి నుంచి తట్టుకునేందుకు చల్లనీటిని తాగేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు.
ఇందుకోసం వారి స్తోమతకు తగ్గట్టుగా నీటిని కాస్త చల్లగా చేసే వస్తువులను కొనుగోలు చేస్తారు.మధ్యతరగతి ధనికులు ఫ్రిజ్లు వారి రేంజ్ లో కొనుగోలు చేసి చల్లని నీటిని తాగేందుకు ఇష్టపడతారు.
మరి పేదవారి పరిస్థితి వస్తే చాలామంది కుండలను కొనుగోలు చేసి వాటిని కాస్త నీడలో ఉంచి చల్లనీటిని( Cool Water ) తాగడానికి ప్రయత్నిస్తారు.
ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఓ మహిళ తాము నీటిని ఎలా చల్లబరుచుకుంటామోన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.దివ్య స్నిహ( Divya Sinha ) అనే ఓ మహిళ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ వినూత్న వీడియోని ప్రజలకు పరిచయం చేసింది.
ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.ప్రతి ఒక్కరు ప్రజలు కొనుగోలు చేయలేరని మరికొందరు కుండలు కొనుగోలు చేసే ఆసక్తి కూడా చూపనని అలాంటి వారి కోసం.చల్లని నీటిని క్షణాల్లో అందించే ఓ చిన్న టెక్నిక్ ను చెబుతూ అందుకు సంబంధించిన వీడియో ని పోస్ట్ చేసింది.
నీటిని చల్లబరిచేందుకు బాటిల్లను( Bottles ) గన్ని సంచులు, అలాగే బట్టలు చుట్టడం మనం మామూలుగా చూసే ఉంటాం.అయితే ఇది ఇంట్లో ఉన్న ఉష్ణోగ్రతల కారణంగా అందులోని నీరు చల్లబడడానికి చాలా సమయం పడుతుంది.ఇందుకు పరిష్కారంగా ఓ తడిబట్టతో చుట్టిన బాటిల్లను చెట్టు కొమ్మలకు కట్టేస్తే చాలు కేవలం 10 నిమిషాల్లో నీరు చల్లబడిపోతుంది.
ఆర్థిక స్తోమత లేని వారు ఈ చిన్న టెక్నిక్ తో వేసవికాలం చాలా కూల్ గా మార్చుకోవచ్చండి అంటూ ఆవిడ తెలిపింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
కేవలం లక్ష పైనే వీడియోకు లైక్స్ వచ్చాయి.