డబ్బు కోసమే తనని పెళ్లి చేసుకోవడం లేదు.. కాబోయే భర్త పై వరలక్ష్మి కామెంట్స్!

సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడి విలన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి వరలక్ష్మి శరత్ కుమార్( Varslakshmi Sarath kumar ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ప్రస్తుతం ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

 Varakakshmi Sarath Kumar React On Trolls Her Boy Friend , Varakakshmi Sarath Kum-TeluguStop.com

ఇక త్వరలోనే శబరి (Sabari) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా మే మూడవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరలక్ష్మి తన వృత్తిపరమైన విషయాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాల గురించి కూడా స్పందించారు.

Telugu Sabari-Movie

వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే ఇప్పటికే ఈమె నికోలయ్ సచ్ దేవ్ ( Nicholia sach dev )అని వ్యక్తితో నిశ్చితార్థం జరుపుకున్నారు అయితే ఈయనకు ఇప్పటికే పెళ్లి జరిగిందని పెళ్లయిన కూడా వరలక్ష్మి తనని రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలపై ఎంతోమంది వివిధ రకాలుగా ఆమెను విమర్శించారు డబ్బు కోసమే ఇప్పటికే పెళ్లి అయినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది అంటూ చాలామంది విమర్శలు చేశారు తాజాగా ఈ విమర్శలపై వరలక్ష్మి స్పందించారు.

Telugu Sabari-Movie

త్వరలోనే నేను పెళ్లి చేసుకోబోతున్నాను కానీ నాకు కాబోయే భర్త గురించి చాలామంది విమర్శలు చేస్తున్నారు డబ్బు కోసమే నేను అతనిని పెళ్లి చేసుకుంటున్నానని కామెంట్లు చేశారా అయితే అతని దగ్గర ఉన్నంత డబ్బు నా దగ్గర కూడా ఉంది.ఇక డబ్బు కోసమే అయితే తనని పెళ్లి చేసుకోవడం దేనికని తెలిపారు.ఇక తనతో నాకు మంచి స్నేహం ఏర్పడినప్పుడు తన మొదటి భార్య కూడా ఉండేదని ఆయన అందరికీ ఇచ్చే గౌరవం మర్యాద వర్క్ పరంగా చూపించే శ్రద్ధ నన్ను ఆకర్షించాయని తెలిపారు.ఇక ఆయన తనకెలా నచ్చారు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు కానీ నా కళ్ళకు తను నచ్చాడు అంటూ ఈ సందర్భంగా వరలక్ష్మి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube