వీడియో: కోరి మరీ దున్నపోతుతో పెట్టుకుంది.. కట్ చేస్తే కుమ్మి పారేసిందిగా..

మెక్సికోలోని( Mexico ) కాబోలో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో ఒక మహిళా టూరిస్ట్ తీవ్రంగా గాయపడింది.

 Tourist Attacked By Wild Bull On Beach In Mexico Video Viral Details, Viral Vide-TeluguStop.com

ఈ టూరిస్ట్( Tourist ) ఒక ఇసుక బీచ్‌లో తన వస్తువులను సేకరిస్తున్నప్పుడు ఒక భారీ దున్నపోతు( Buffalo ) ఆమె దగ్గరకు వచ్చింది.నల్లటి దుస్తులు ధరించిన ఆమె ఒక టోపీ ధరించి ఉండగా, దున్నపోతు ఆమె బ్యాగులో ఆహారం కోసం వెతుకుతూ వచ్చింది.

చుట్టుపక్కల వారు ఆమెను జంతువు నుంచి దూరంగా ఉండమని హెచ్చరించినప్పటికీ, ఆమె దాని దగ్గరే ఉండాలని నిర్ణయించుకుంది.దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా, ఎద్దు ప్రవర్తన మారిపోయింది.

అది కోపోద్రేకంతో ఆమెపై దాడి చేసి, నేలపైకి విసిరివేసింది.దీని కారణంగా ఆమె తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది, ఆమె ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి తెలియదు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఆ మహిళా టూరిస్ట్ తన బ్యాగులు తీసుకునేందుకు వంగి ఉండగా, దున్నపోతు వాటి దగ్గరకు వచ్చి వాటిని వాసన చూస్తుంది.ఓ వ్యక్తి ఆందోళనతో, “మీరు నిజంగా ప్రమాదంలో పడబోతున్నారు.

దయచేసి, అక్కడ ఉండకండి, వెళ్ళిపోండి!” అని హెచ్చరిస్తాడు.కానీ, అతని మాట వినకుండా, ఆమె దున్నపోతు కొమ్ములపై చేయివేసి దానిని తోలేయాలని ప్రయత్నిస్తుంది.

ఆమె బ్యాగును( Bag ) ఎద్దు లాగేసుకుపోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుంది.ఆ పక్కనున్న వ్యక్తి, “దయచేసి, మహిళా, అక్కడి నుంచి వెళ్ళండి!” అని బతిమాలుతాడు.

Telugu Beach, Buffalo Attack, Bullattack, Bull Attack, Mexico, Mexico Beach, Nri

కానీ, ఆమె ఎద్దుతోనే ఇంకా ఇబ్బంది పడుతూనే ఉంటుంది.ఉన్నట్లుండి, ఎద్దు ఆమెపై దూసుకు వెళ్లి నేలపై పడేసి కుమ్మేస్తుంది.ఎద్దు ఆమెను పదే పదే నేలపై పడేస్తూ దాడి చేస్తుంది.ఆమె పారిపోవడానికి ప్రయత్నిస్తుంది.చివరికి, ఇసుక మీదే పడి ఉంటుంది.ఇతర సముద్ర తీర వాసులు ఎద్దును వెళ్ళగొట్టేందుకు ప్రయత్నిస్తారు.

ఈ ఘటన జంతువు ఆమె వస్తువులపైనే దృష్టి పెట్టి, ఆహారం కోసం వెతుకుతూనే ఉంటుంది.

Telugu Beach, Buffalo Attack, Bullattack, Bull Attack, Mexico, Mexico Beach, Nri

ఈ వీడియో చూసిన చాలామంది ఆందోళన, కోపాన్ని వ్యక్తం చేశారు.ఆమెకేమైందో అనే ఆందోళన కొంతమంది వ్యక్తం చేస్తే, మరి కొంతమంది ఆమెకు ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు ఎందుకు? అని కోపాన్ని వ్యక్తం చేశారు.ఇలాంటి జంతువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని మరి కొంతమంది సలహా ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube