కొద్ది రోజుల క్రితమే ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది.టిడిపి, జనసేన , బిజెపి కూటమిగా( TDP Janasena BJP ) ఏర్పడి వైసిపి పై రాజకీయ యుద్ధానికి దిగాయి.
హోరా హోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి.ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల మేనిఫెస్టోలతో పార్టీలు జనాల్లోకి వెళ్లాయి.
ఏదైతేనేమి సజావుగా ఎన్నికల తంతు ముగిసింది.ఇక ఫలితాల పైనే అందరూ దృష్టి సారించారు.
ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ? ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయి ? ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే దానిపైనే ప్రస్తుతం అంతా చర్చ మొదలుపెట్టారు.అయితే ఎన్నికల ఫలితాలు అన్ని పార్టీలకు టెన్షన్ పుట్టిస్తున్నాయి.
మొదటి నుంచి వైసిపి( YCP ) ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో నే ఉంది .వై నాట్ 175 అనే నినాదాన్ని వినిపిస్తూ వస్తున్నారు ఆ పార్టీ అధినేత జగన్ .ఇక మూడు పార్టీల కూటమి అయిన టిడిపి , జనసేన, బిజెపిలు సైతం గెలుపు ధీమాతో ఉన్నాయి.తమ మూడు పార్టీల బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాను ప్రదర్శిస్తున్నాయి .అయితే వాస్తవ పరిస్థితులు ఏమిటనే దానిపైన ఇప్పుడు దృష్టి సారించాయి.

ఇక కూటమి పార్టీలకు క్రాస్ ఓటింగ్( Cross Voting ) టెన్షన్ మొదలైంది.పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన ఏజెంట్లు , ముఖ్య కార్యకర్తల నుంచి వచ్చిన సమాచారంతో , క్రాస్ ఓటింగ్ భారీగా జరిగిందని, అది తమకు ఇబ్బందికరంగా మారుతుందని టెన్షన్ పడుతున్నాయి .ముఖ్యంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో ఈ క్రాస్ ఓటింగ్ భయం ఎక్కువయింది.తూర్పుగోదావరి జిల్లాలో( East Godavari District ) కూటమి తరఫున మూడు పార్టీ అభ్యర్థులు పోటీకి దిగారు .అయితే ఎన్నికల ప్రచారంలో మూడు గుర్తులను ఓటర్లకు చెబితే కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో ఎవరికి వారు ఎన్నికల ప్రచారం నిర్వహించి తమ గుర్తులును ప్రచారం చేసుకున్నారట.మూడు గుర్తులు ఓటర్లకు చెబితే కన్ఫ్యూజ్ అయ్యి, అసలుకే తెస్తారనే ఉద్దేశంతో ఒక గుర్తునే ప్రచారం చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే కొన్నిచోట్ల రెండు గుర్తులకు ఓటు వేయాల్సి రావడం ఇబ్బందికరంగా మారింది.కాకినాడ పార్లమెంట్ కు( Kakinada Parliament ) జనసేన అభ్యర్థి పోటీ చేయగా, రాజమండ్రి నుంచి బిజెపి అభ్యర్థి పోటీ చేశారు.దీంతో ఈ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో రెండు గుర్తులను ప్రచారం చేయాల్సిన పరిస్థితి కూటమి పార్టీలకు ఏర్పడింది.
రెండు గుర్తులను గుర్తుపెట్టుకుని ఓటు వేయాల్సిన పరిస్థితి వచ్చింది.దీంతో ఓటింగ్ జరిగిన తీరును ఇప్పుడు తీరిగ్గా విశ్లేషించుకుంటున్నాయి.ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని ఒక అంచనాకు వస్తున్నాయి. కాకినాడ పార్లమెంట్ పరిధిలో వైసీపీ నుంచి పోటీ చేసిన చలమలశెట్టి సునీల్( Chalamasetty Sunil ) మూడుసార్లు వివిధ పార్టీల నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆయనపై ఇప్పుడు కొంత సానుభూతి ఉందని, స్థానికంగా ఆయన అనేకమందికి ఉపాధి తమ సంస్థల ద్వారా కల్పించడం,

జనసేన అభ్యర్థి కొత్తవాడు కావడం వంటివన్నీ సునీల్ కు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు అదీ కాకుండా కాకినాడ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎక్కువ క్రాస్ ఓటింగ్ జరిగిందని , కూటమి పార్టీలు అంచనాకు వస్తున్నాయి. దీంతో వైసిపి అభ్యర్థి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నట్లుగా అంచనాకు వస్తున్నాయి ఇక ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి( Daggubati Purandeshwari ) పోటీ చేసిన రాజమండ్రి పార్లమెంట్ స్థానం పరిధిలో వైసిపి ఓటు బ్యాంకు కూడా పురంధరేశ్వరి కి పడినట్లుగా ప్రచారం జరుగుతుంది.ఎన్టీఆర్ కుమార్తె గానే కాకుండా, మహిళ కావడంతో ఎక్కువ మహిళలు అసెంబ్లీకి వైసిపికి ఓటు వేసిన వారు కూడా పార్లమెంటుకు వచ్చేసరికి బిజెపి అభ్యర్థికి ఓటు వేసినట్లుగా అంచనా వేస్తున్నారు.ఇక వైసిపి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ గూడూరు శ్రీనివాస్( Dr.Guduru Srinivas ) మంచి వ్యక్తి కావడం, అందరికీ తెలిసిన వ్యక్తి కావడంతో టిడిపి సానుభూతిపరులు సైతం వైసీపీ అభ్యర్థికి ఓటు వేసినట్లుగా అంచనా వేస్తున్నారు.దీంతో కాకినాడ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం లో క్రాస్ ఓటింగ్ ఎక్కువ జరిగిందనే టెన్షన్ కూటమి పార్టీల్లో నెలకొంది.







