పోస్ట్ స్టడీ వీసా రూట్‌ను కొనసాగించాల్సిందే .. యూకే ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక

భారతీయ గ్రాడ్యుయేట్ల( Indian Graduates ) ఆధిపత్యంలో వున్న పోస్ట్ స్టడీ వీసా( Post Study Visa ) మార్గం యూకేలోని యూనివర్సిటీలకు దేశీయంగా ఆర్ధిక నష్టాలను పూడ్చటంతో పాటు దేశ పరిశోధనా రంగాన్ని విస్తరించడంలో సహాయపడుతుందని ఓ నివేదిక పేర్కొంది.యూకే హోం సెక్రటరీ జేమ్స్ క్లెవర్లీ( James Cleverly ) నేతృత్వంలోని ఇండిపెండెంట్ మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ (ఎంఏసీ) .

 Uks Graduate Route Visa Dominated By Indians Should Continue Details, Post-stud-TeluguStop.com

గ్రాడ్యుయేట్ వీసాపై సమీక్షను చేపట్టింది.ఇది అంతర్జాతీయ విద్యార్ధులు తమ డిగ్రీ తర్వాత రెండేళ్ల వరకు పని అనుభవాన్ని సంపాదించుకోవడానికి వీలు కల్పిస్తుంది.

ఈ వీసా కేటగిరీలో భారతీయ విద్యార్ధులు( Indian Students ) 2021-2023 మధ్య 89,200 వీసాలు లేదా మొత్తం గ్రాంట్లలో 42 శాతాన్ని కలిగి వున్నారని కమిటీ కనుగొంది.ఎంఏసీ ఛైర్ ప్రొఫెసర్ బ్రియాన్ బెల్ ( Brian Bell ) మాట్లాడుతూ.

మా సమీక్ష గ్రాడ్యుయేట్ రూట్ అలాగే ఉండాలని సిఫార్సు చేస్తోందన్నారు.యూకే( UK ) ఉన్నత విద్యా వ్యవస్థ, సమగ్రతను ఇది అణగదొక్కడం లేదని బ్రియాన్ బెల్ పేర్కొన్నారు.

అంతర్జాతీయ విద్యార్ధులు యూకేకి వచ్చి చదువుకోవడానికి తాము అందించే ఆఫర్‌లో ఈ గ్రాడ్యుయేట్ రూట్( Graduate Route ) కీలక భాగమన్నారు.ఈ విద్యార్ధులు చెల్లించే ఫీజులు బ్రిటీష్ విద్యార్ధులకు బోధించడంలో, పరిశోధనలు చేయడంలో జరిగే నష్టాలను పూడ్చుకోవడానికి యూనివర్సిటీలకు సహాయపడతాయని బెల్ తెలిపారు.

ఆ విద్యార్ధులు లేకుండా యూనివర్సిటీలు కుదించబడితే తక్కువ పరిశోధనలు జరుగుతాయని ఆయన వెల్లడించారు.

Telugu Indian, Visa, Rapidreview, Uksecretary, Uk Research-Telugu NRI

అయితే బెల్ సమీక్ష.ఇమ్మిగ్రేషన్ పాలసీ, ఉన్నత విద్యా విధానానికి మధ్య ఉన్న సంక్లిష్ట పరస్పర చర్యను హైలైట్ చేస్తోంది.గ్రాడ్యుయేట్ రూట్ యూకే ఉన్నత విద్యా వ్యవస్థ సమగ్రతను , నాణ్యతను దెబ్బతీయడం లేదని బ్రియాన్ బెల్ అన్నారు.

ఇది ప్రభుత్వ అంతర్జాతీయ విద్యా వ్యూహానికి మద్ధతు ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.‘‘ర్యాపిడ్ రివ్యూ ఆఫ్ ది గ్రాడ్యుయేట్ రూట్ ’’( Rapid Review Of The Graduate Route ) నివేదిక ప్రకారం.

వీసా మార్గంలో ఉన్న వారిలో ఎక్కువమంది పోస్ట్ గ్రాడ్యుయేట్‌లో బోధించిన కోర్సులను పూర్తి చేశారు.

Telugu Indian, Visa, Rapidreview, Uksecretary, Uk Research-Telugu NRI

కాగా.దేశంలో నానాటికీ పెరుగుతున్న వలసలను తగ్గించడానికి ప్రధాని రిషి సునాక్( PM Rishi Sunak ) సారథ్యంలోని బ్రిటన్ ప్రభుత్వం కఠినమైన చర్యలకు దిగుతున్న సంగతి తెలిసిందే.కొద్దిరోజుల క్రితం ఫ్యామిలీ వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు కనీస వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55 శాతం పెంచింది.

తాజాగా బ్రిటన్‌కు చిన్న పడవల్లో అక్రమంగా ప్రవేశించే వలసదారులను నిరోధించడానికి రూపొందించిన పాలసీని పార్లమెంట్ ఆమోదించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube