అభిమానులు నిరాశ చెందకండి.ఈసారి తప్పకుండా రిలీజ్ చేస్తాం.
మళ్లీ పోస్ట్ పోన్ చేసే ఆలోచన అస్సలు లేదు.ప్రస్తుతం కొన్ని సినిమాల మేకర్స్ ఇదే చెబుతున్నారు.
కానీ సినిమాలను వరుసగా వాయిదా వేస్తూ చివరికి అభిమానులకు నిరాశే మిగులుస్తున్నారు.అదిగో విడుదలవుతుంది ఇదిగో విడుదల అవుతుంది అని అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.
కానీ సినిమాలు వరుసగా వాయిదా అవుతూనే ఉన్నాయి.ఇలా వాయిదాపడుతూ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తున్న సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అడవి శేష్ హీరోగా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న సినిమా మేజర్.ఇక ఈ సినిమాను అటు మహేష్ బాబు ఏ ఎం బి సినిమాస్ నిర్మిస్తోంది.
ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చింది ఈ సినిమా ఇక ఇప్పుడు మరోసారి పోస్ట్ పోన్ అయ్యింది.గత ఏడాది జూలై 22 ఇక ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 11నా, మొన్నటికి మొన్న మే 27 రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.
ఇక ఇప్పుడు మరో సారి పోస్ట్ ఫోన్ చేసి జూన్ 3న విడుదల చేస్తామంటూ చెప్పారు.వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్గా తెరకెక్కుతున్న ఎఫ్ 3 సినిమా విడుదల కూడా ఇలాగే మారిపోయింది.
జనవరి నుంచి ఫిబ్రవరి 25 వరకు షిప్ట్ అయ్యింది.భీమ్లా నాయక్ అడ్డు రావడంతో మరోసారి రీషెడ్యూల్ చేసుకున్నారు.
దీంతో ఏప్రిల్ 29 కి పోస్ట్ పోన్ అయ్యింది.ఇప్పుడు ఆచార్య లైన్ లో ఉండడంతో ఈ సారి కూడా మళ్లీ పోస్ట్ పోన్ అయిన మే 27 రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
నాని అంటే సుందరానికి సినిమా ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అయ్యింది.అయితే ఇది లాస్ట్ ఇయర్ లోనే రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా పోస్ట్పోన్ అవ్వక తప్పలేదు.ఏప్రిల్, మే, జూన్ ఇలా వరుసగా రిలీజ్ డేట్ లు అనౌన్స్ చేసి చివరికి జూన్ 10న థియేటర్లోకి వస్తున్నామని ఒక డేట్ ఫిక్స్ చేశారు.మాస్ మహారాజా రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా ఇదే పరిస్థితి.
గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.కానీ త్రిబుల్ ఆర్ రావడంతో చివరికి జూన్ 17 కు మార్చారు.
ఇక మరో యంగ్ హీరో విశ్వక్సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా అని మూడు సార్లు పోస్ట్ ఫోన్ చేయగా.ఏప్రిల్ 22న రిలీజ్ చేశారు.
తర్వాత ఏప్రిల్ 30 ఇక ఇప్పుడు మే 6వ తేదీ రిలీజ్ డేట్ మార్చేశారు.