విజయవాడ( Vijayawada )లో విషాద ఘటన చోటు చేసుకుంది. గురునానక్ నగర్ లో నివాసం ఉంటున్న డాక్టర్ కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డారు.
మృతుల్లో డాక్టర్ దంపతులు, ఇద్దరు పిల్లలతో పాటు వృద్ధురాలు ఉన్నట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు( Police ) ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు హత్యా ? లేక బలవన్మరణమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఈ క్రమంలోనే క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో దర్యాప్తు ముమ్మరం చేశారు.







