గ‌ర్భాశ‌యం ఆరోగ్యంగా ఉండాలంటే ఆడ‌వారు ఖ‌చ్చితంగా తినాల్సిన ఆహారాలు ఇవే!

ఇటీవల కాలంలో చాలా మంది మహిళలు గర్భాశయ సమస్యలతో( Uterus Problem ) బాధపడుతున్నారు.ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఫైబ్రాయిడ్స్‌, గర్భాశయ క్యాన్సర్, ఇన్ఫెక్షన్స్, గ‌ర్భాశ‌య వాపు ఇలా రకరకాల సమస్యలు మహిళలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

 Best Foods To Improve Uterus Health!, Healthy Foods, Uterus Health, Uterus, Uter-TeluguStop.com

అలాగే గర్భాశయం ఆరోగ్యంగా లేకపోతే మహిళల సంతానోత్పత్తి పై ప్రభావం చూపుతుంది.సంతాన‌లేమి త‌లెత్తే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి.

ఇటువంటి స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండాలి అంటే గర్భాశయం ఆరోగ్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాలి.గర్భాశయాన్ని ఆరోగ్యంగా దృఢంగా మార్చుకోవాలి.

Telugu Tips, Healthy Foods, Healthy Uterus, Uterus, Uterus Problems-Telugu Healt

అందుకు మహిళలు కచ్చితంగా కొన్ని కొన్ని ఆహారాలు( Foods ) తీసుకోవాలి.మరి ఇంత‌కీ ఆ ఆహారాలు ఏంటో లేట్ చేయ‌కుండా తెలుసుకుందాం ప‌దండి.గర్భాశయ ఆరోగ్యానికి కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ పాటు విటమిన్ సి, విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఎంతో అవసరం.అందుకోసం ఆకుకూరలు, తాజా కూరగాయలు, పాలు, పెరుగు, వాల్‌న‌ట్స్‌, బాదం, పిస్తా వంటి ఆహారాల‌ను డైట్ లో చేర్చుకోవాలి.

అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు వంటి సీడ్స్ ను డైలీ తినాలి.అలాగే అవకాడో, బెర్రీస్, దానిమ్మ, బొప్పాయి, ఆరెంజ్, కివి, నిమ్మ‌, జామ‌ వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.

ఖర్జూరం, డ్రై అంజీర్, కిస్ మిస్ వంటి డ్రైడ్ ఫ్రూట్స్( Dry Fruits ) ను డైట్ లో చేర్చుకోవాలి.గుడ్లు, చేపలు, బీన్స్, గోధుమలు, రాగులు, జొన్నలు వంటి ఆహారాలను తీసుకోవాలి.

వైట్ రైస్ కు బ‌దులుగా బ్రౌన్ రైస్‌, ఓట్స్ వంటివి ఎక్కువ‌గా తినాలి.

Telugu Tips, Healthy Foods, Healthy Uterus, Uterus, Uterus Problems-Telugu Healt

ఇవి గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్‌ ఏర్పడకుండా రక్షిస్తాయి.గ‌ర్భాశ‌య‌ ఇన్ఫెక్షన్స్( Uterus Infections ) రాకుండా అడ్డుకట్ట వేస్తాయి.నెలసరి, సంతానలేమి సమస్యలను దూరం చేస్తాయి.

గర్భాశయ క్యాన్సర్ వచ్చే రిస్క్ ను తగ్గిస్తాయి, గర్భాశయాన్ని ఆరోగ్యంగా దృఢంగా మారుస్తాయి.మ‌హిళల్లోసంతానోత్పత్తి సామ‌ర్థాన్ని పెంచుతాయి.

కాబట్టి యూట్రస్ ప్రాబ్లమ్స్ కు దూరంగా ఉండాలనుకునే వారు తప్పకుండా పైన చెప్పిన ఆహారాలను డైట్ లో చేర్చుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube