White Hair Remedies : తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చే కొబ్బ‌రి చిప్ప‌లు.. ఎలాగంటే?

సాధారణంగా వయసు పైబ‌డే కొద్ది నల్లగా ఉన్న జుట్టు తెల్లగా మారుతుంటుంది.దాదాపు అందరూ ఫేస్ చేసే సమస్యే ఇది.

 Coconut Shell Helps To Turn White Into Black!, Coconut Shell, White Hair, Black-TeluguStop.com

కానీ కొందరు మాత్రం తక్కువ వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు.చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటానికి ఎన్నో కారణాలు ఉంటాయి.

అయితే కారణం ఏదైనా తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు.అయితే ఎక్కువ శాతం మంది మార్కెట్లో లభ్యమయ్యే కలర్స్ పై ఆధారపడుతుంటారు.

కానీ న్యాచురల్ గా కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.అందుకు కొబ్బరి చిప్పలు అద్భుతంగా సహాయపడతాయి.అవును మీరు విన్నది నిజమే.కొబ్బరిని తొలగించిన త‌ర్వాత‌ చిప్పలు చాలా మంది పారేస్తుంటారు.

కానీ ఇకపై అలా చేయకండి.కొబ్బరి చిప్పలు ఉపయోగించి తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Black, Coconut Shell, Coconutshell, Care, Care Tips, Latest, White-Telugu

ముందుగా ఒక‌టి లేదా రెండు కొబ్బరి చిప్పలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో కొబ్బరి చిప్ప ముక్కలు వేసి నల్లగా మారేంత వరకు వేయించాలి.ఇలా వేయించిన కొబ్బరి చిప్ప ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ పొడిలో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె మ‌రియు రెండు టేబుల్ స్పూన్లు నువ్వుల నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి.

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్‌ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా తల స్నానం చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు కనుక చేస్తే తెల్ల జుట్టు సహజంగానే నల్లబడుతుంది.

కాబట్టి తెల్ల జుట్టు సమస్యతో సతమతం అయ్యేవారు ఇకపై కలర్స్ పై ఆధార పడకుండా కొబ్బరి చిప్పలతో పైన చెప్పిన విధంగా చేసేందుకు ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube