ప్రతి మహిళ పొడవైన,అందమైన నల్లని జుట్టు కావాలని కోరుకుంటుంది.అయితే ఈ రోజుల్లో జీవనశైలిలో వచ్చిన మార్పులు,కాలుష్యం,విటమిన్స్ లోపం,సరైన ఆహారం తీసుకోకపోవటం వంటి కారణాలతో జుట్టు అధికంగా రాలిపోతుంది.
ఈ సమస్యల కోసం ఎటువంటి మందులను వాడకుండా మన పెరట్లో ఉండే కరివేపాకు సాయంతో పరిష్కరించుకోవచ్చు.
కరివేపాకులో ఉండే పోషకాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, అమినోయాసిడ్లు జుట్టు రాలకుండా చేస్తాయి.
జుట్టు రాలకుండా ఉండటానికి కరివేపాకును ఎలా ఉపయోగించాలో చూద్దాం.కరివేపాకు పేస్ట్ కి కొంచెం పెరుగు కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.
ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.
కరివేపాకు పేస్ట్ కి కొంచెం పాలను కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.
ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.
ఆలివ్ నూనెలో కరివేపాకు ఆకులను వేసి బాగా మరిగించాలి.
ఆ నూనెను తలకు బాగా పట్టించి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.
అంతేకాకుండా కరివేపాకును ఆహారంలో భాగంగా చేసుకుంటే జుట్టు రాలటం తగ్గిపోతుంది.
చాలా మంది కూరల్లో కరివేపాకును తీసి పాడేస్తూ ఉంటారు.ఆలా కాకుండా కరివేపాకును తింటే జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చు.