కొడుకు చిన్నప్పటి ఫోటో షేర్ చేసిన నమ్రత.. అచ్చం మహేష్ లా ఉన్నాడంటూ?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) భార్య నమ్రత( Namrata ) గురించి మనందరికీ తెలిసిందే.నమ్రత ప్రస్తుతం ఒకవైపు ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటూనే మరొకవైపు తన భర్తకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలను కూడా చూసుకుంటూ ఉంటుంది.

 Namrata Hirodkar Gautham Sitara Ghattamaneni Childhood Photos , Namrata, Gautham-TeluguStop.com

అంతే కాకుండా అప్పుడప్పుడు మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ తన గొప్ప మనసును చాటుకుంటూ ఉంటుంది.కాగా నమ్రత తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన భర్త కూతురు కొడుకుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

అందులో భాగంగానే తాజాగా పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ కొన్ని అరుదైన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు నమ్రత.ఈ క్రమంలోనే గౌతమ్ పసిపిల్లాడిగా ఉన్న పిక్‌ని షేర్ చేసారు.మహేష్ వారసులు గౌతమ్, సితార ( Gautham, Sitara )కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు.దీంతో ఇప్పుడు ఈ ఇద్దరు ఎలా ఉన్నారో అనే విషయాలు రెగ్యులర్ గా తెలుస్తూ వస్తున్నాయి.

కానీ చిన్నతనంలో ఈ ఇద్దరు ఎలా ఉండేవారో అనే విషయాలు కొన్ని అరుదైన ఫోటోలు ద్వారానే తెలుస్తుంటాయి.ఇలాంటి కొన్ని ఓల్డ్ మెమరీ పిక్స్ ని నమ్రతా షేర్ చేసారు.

ఇటీవల సితార చిన్నప్పటి క్యూట్ పిక్స్ ని షేర్ చేసిన నమ్రతా.తాజాగా గౌతమ్ పసిపిల్లాడిగా ఉన్న ఫోటోని షేర్ చేసారు.ఆ ఫొటోల్లో గౌతమ్ ని నమ్రతా ముద్దాడుతూ కనిపిస్తుంది.ఇక గౌతమ్ లుక్స్ అయితే చాలా క్యూట్ గా కనిపిస్తూ ముద్దొస్తున్నాయి.ఇక ఈ పిక్స్ ని చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్.గౌతమ్ ని చూస్తుంటే అచ్చం చిన్నప్పటి మహేష్ నే చూసినట్లు ఉందిఅంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ప

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube