ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు.. అమెరికాలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్

ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధ ప్రభావం పలు దేశాలపై నేరుగా పడుతోంది.ఇజ్రాయెల్‌కు( Israel ) మద్ధతుగా కొందరు, పాలస్తీనాకు( Palestine ) మద్ధతుగా మరికొందరు ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

 Indian-origin Student Arrested In Us For Joining In Anti-israel Protests Details-TeluguStop.com

ఇవి కొన్నిచోట్ల హింసాత్మంగా మారి శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి.అగ్రరాజ్యం అమెరికాలోని యేల్, కొలంబియా, న్యూయార్క్ యూనివర్సిటీలు సహా అనేక విశ్వవిద్యాలయాలలో ఇజ్రాయెల్ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి.

ఈ నిరసనల్లో అనేక దేశాలకు చెందిన విద్యార్ధులు , యువత పాల్గొంటున్నారు.తాజాగా ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో చదువుతున్న భారత సంతతికి చెందిన విద్యార్ధినిని పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో( Anti-Israel Protests ) పాల్గొన్నందుకు గాను అరెస్ట్ చేశారు.

అలాగే ఆమెను క్యాంపస్ నుంచి కూడా నిషేధించారు.

Telugu Israel, Gaza, Indian, Indian Origin, Palestine, Princetonpublic, Princeto

తమిళనాడులోని పారిశ్రామిక నగరం కోయంబత్తూరులో పుట్టి, కొలంబస్‌లో పెరిగిన అచింత్య శివలింగన్‌ను( Achinthya Sivalingan ) క్యాంపస్‌ నుంచి నిషేధించడంతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ( Princeton University ) ప్రతినిధి తెలిపారు.గురువారం ఉదయం 7 గంటలకు మెక్‌కోష్ కోర్డ్‌యార్డులో కొందరు విద్యార్ధులు పాలస్తీనా అనుకూల నిరసనల కోసం శిబిరాన్ని ఏర్పాటు చేశారు.యూనివర్సిటీ అధికారులు దీనిని తీవ్రంగా పరిగణించడంతో పాటు ఇద్దరు విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నారు.

Telugu Israel, Gaza, Indian, Indian Origin, Palestine, Princetonpublic, Princeto

సుమారు 100 మంది అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ విద్యార్ధులు గురువారం తెల్లవారుజామున మెక్‌కోష్ కోర్ట్‌యార్డ్‌లో( McCosh Courtyard ) ఈ నిరసనలు ప్రారంభించారు.తొలుత ప్రిన్స్‌టన్ పబ్లిక్ సేఫ్టీ విభాగం విద్యార్ధులను హెచ్చరించింది.అయినప్పటికీ వారి ఆదేశాలను బేఖాతరు చేయడంతో ఇద్దరు విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నారు.వీరిలో ఒకరు జీఎస్ అచింత్య శివలింగం , మరొకరు హసన్ సయ్యద్ జీఎస్ .

కళాశాలలు ఇజ్రాయెల్‌తో తమ ఆర్ధిక సంబంధాలను తెంచుకోవాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు.కొందరు యూదు విద్యార్ధుల నిరసనలు ఇప్పుడు సెమిటిజంగా మారాయని, తాము క్యాంపస్‌లోకి రావాలంటేనే భయంగా వుందని ఆవేదన వ్యక్తం చేశారు.

క్యాంపస్‌లో ఎలాంటి నిరసనలకు పాల్పడినా తీవ్ర పరిణామాలుంటాయని క్యాంపస్ లైఫ్ వైస్ ప్రెసిడెంట్ రోచల్ హెచ్చరించారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube