సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నయనతార ( Nayanatara )ఇటీవల సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికీ వరుసగా సినిమా అవకాశాలు అందుకొని దోసూకుపోతున్నారు.ఇలా హీరోయిన్ గా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు.
అయితే ఇప్పటివరకు కేవలం సౌత్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి నయనతార ప్రస్తుతం బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు.
ఈమె ఇటీవల అట్లీ డైరెక్షన్లో నటుడు షారుక్ ఖాన్ తో కలిసి నటించిన జవాన్( Jawan ) సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నయనతార అనంతరం ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలి దర్శకత్వంలో కూడా సినిమా అవకాశం అందుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలువబడలేదు.
ఇక డైరెక్టర్ విగ్నేష్ శివన్ ( Vignesh Shivan ) నుపెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల తల్లిగా మారినటువంటి నయనతార ఒక వైపు పిల్లల బాధ్యతలను చూసుకుంటూనే మరోవైపు నటిగా ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలలో నటిస్తున్నారు.పెళ్లి తర్వాత నయనతార పెద్దగా గ్లామర్ షోకి తావు లేకుండా పద్ధతిగా దుస్తులను ధరిస్తూ కనిపించారు.అయితే మొదటిసారి ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
కెరియర్ మొదట్లో నయనతార ఎలాగైతే ఉండేదో అచ్చం అలాగే ప్రస్తుతం గ్లామర్ షో చేస్తూ ఫోటోషూట్ లో చేయించుకున్నారు.ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బ్లాక్ కలర్ డ్రెస్సులో ఎద అందాలన్నింటినీ ఆరబోస్తూ మత్తెక్కించే కళ్ళతో అందరిని మాయ చేస్తూ ఉన్నటువంటి ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
ఇక ఈ ఫోటోలు చూసినటువంటి అభిమానులు నయనతార ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.చాలా రోజుల తర్వాత నయనతారని ఈ గెటప్ లో చూడటంతో అభిమానులు కూడా ఈమె స్టన్నింగ్ లుక్ పై కామెంట్లో చేస్తున్నారు.
ప్రస్తుతం నయనతారకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాని షేర్ చేస్తున్నాయి.