మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన దాదాపు 4 దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కడే మెగాస్టార్ గా కొనసాగుతున్నాడు.
ఇక ఇప్పటికీ ఆయన ప్లేస్ ను రీప్లేస్ చేసే హీరోలు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఎందుకంటే ఆయనను మించిన నటులు ఇంకా ఇండస్ట్రీకి దొరకలేదనే చెప్పాలి.
ఆయన ఇప్పటికీ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో సక్సెస్ లను కంటిన్యూ చేస్తున్నాడు.మరి ఇలాంటి క్రమంలో ఆయన చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంభర( Vishwambhara ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా కనక సూపర్ డూపర్ సక్సెస్ అయితే చిరంజీవి కెరీర్ మరింత పీక్ స్టేజిలోకి వెళ్ళిపోతుందనే చెప్పాలి.ఇక ఇప్పటికే ఆయన కున్న మార్కెట్ టాప్ స్థాయిలో ఉండగా, ఇక ఈ సినిమా సక్సెస్ తో అది మరింత భారీగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇక ఈ సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది.
కాబట్టి ఆయన మార్కెట్ కి పోతుందని చెప్పాలి ఇదిలా ఉంటే ఆయన నెక్స్ట్ సినిమాని హరీష్ శంకర్ తో ( Harish Shankar ) చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ ను( Shruti Haasan ) తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే చిరంజీవి శృతి కాంబో లో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చింది.

ఇక ప్రస్తుతం ఆమెకి సక్సెస్ లు దక్కడం లేదనే చెప్పాలి.ఆమె ఈ సినిమాతో ఒక మంచి సక్సెస్ ను దక్కించుకుంటుందేమో చూడాలి.ఇక ఇప్పటి వరకు శృతిహాసన్ కి ఫ్లాప్ లు అయితే వస్తున్నాయి.కాబట్టి ఒకప్పుడు హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమాతో తనకు సూపర్ డూపర్ సక్సెస్ ను అందించాడు.
ఇక హీరోయిన్ గా మరోసారి తనకు సక్సెస్ ని అందిస్తాడని శృతిహాసన్ చిరంజీవి తో ఈ సినిమా కి సైన్ చేసినట్టుగా తెలుస్తుంది…
.







